Ads
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ రోజు రోజుకు యంగ్ గా మారిపోతోంది. ఆయనకు నలభై ఏళ్ళు దాటాయంటే ఎవ్వరూ నమ్మరు. ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ తక్కువేమి కాదు. ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే మహేష్ పైన మనసు పారేసుకునే అమ్మాయిలు చాలా మందే ఉన్నారండోయ్..
Video Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్‌లో విడుదల అవ్వాల్సి ఉంది.
కానీ కరోనా కారణంగా, అలాగే ఆర్ఆర్ఆర్ విడుదల కూడా మార్చ్, ఏప్రిల్‌లో ఉండడంతో సినిమా బృందం సినిమా మళ్లీ విడుదల వాయిదా వేశారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సినిమా మే 12 న విడుదల అవుతుంది అని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఇటీవలే ఈ సినిమా నుంచి కళావతి సాంగ్ విడుదల అయ్యి ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషన్ అవుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటించబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నతనంలో పాత్రని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పోషించనున్నాడట.
గతంలో నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రని గౌతమ్ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారి సర్కారు వారి పాటలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రని సుధీర్ బాబు కుమారుడు చరిత్ర నటించనున్నారట.
End of Article