Focus: ప్రేక్షకుల ఆదరణే ‘ఫోకస్’..! ప్రేమికుల రోజున పోస్టర్ రిలీజ్..!

Focus: ప్రేక్షకుల ఆదరణే ‘ఫోకస్’..! ప్రేమికుల రోజున పోస్టర్ రిలీజ్..!

by Megha Varna

Ads

నూతన తారాగణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ ఫోకస్’ . సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ శంకర్, బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి, సీనియర్ యాక్టర్ సుహాసిని మణిరత్నం, భాను చందర్ లీడ్ క్యారెక్టర్లలో నటిస్తున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గా ‘ఫోకస్’ మూవీ నుంచి స్పెషల్ ఫోస్టర్ రిలీజ్ చేశారు. హీరో విజయ్ శంకర్, హీరోయిన్ అషూరెడ్డి కౌగిలించుకుని నవ్వుతూ.. ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. వాలెంటైన్స్ డేకి ఫెర్పెక్ట్ ఫోస్టర్ అవ్వడంతో రిలీజ్ చేశామని చిత్ర యూనిట్ అంటోంది.

Video Advertisement

డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ద్వారా సూర్యతేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సీనియర్ యాక్టర్ సుహాసిని, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి ఈ సినిమాకు ఎస్సెట్ కానున్నారు.

ఓ మర్డర్ నేపథ్యంలో పక్కా థ్రిల్లర్ జోనర్ లో ఈసినిమా రాబోతోంది. సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని చిత్రయూనిట్ ధీమాగా చెబుతోంది. ఈ సినిమాలో విజయ్ శంకర్ పోలీస్ గా నటిస్తుండగా… సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించనుంది. జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ ఇతర ముఖ్య‌ పాత్రల్లో న‌టించారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా జీ సూర్యతేజ కాగా.. సంగీతాన్ని వినోద్ యాజమాన్య అందించారు. సాహిత్యాన్ని కాసర్ల శ్యాం సమకూర్చారు.


End of Article

You may also like