బాబా సినిమా పోస్టర్‌లో “రజినీకాంత్” పక్కన ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా..? అతను ఇప్పుడు..?

బాబా సినిమా పోస్టర్‌లో “రజినీకాంత్” పక్కన ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా..? అతను ఇప్పుడు..?

by Mohana Priya

Ads

చిన్నప్పుడు తమ సినిమా కెరీర్‌ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

Video Advertisement

కొంతమంది సినిమాల్లో ఏర్పరచుకోవడానికి నటిస్తే, కొంతమంది మాత్రం టైం పాస్ కోసం, లేదా ఆ సమయంలో ఆ పాత్రలో నటించడానికి ఎవరూ లేకపోతే వారు నటించడం జరుగుతూ ఉంటుంది. అలా ప్రస్తుతం చాలా ఫేమస్ అయిన ఒక సెలబ్రిటీ కూడా తన చిన్నప్పుడు ఒక సినిమా పోస్టర్‌లో కనిపించారు.

famous young celebrity in rajinikanth baba movie poster

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు.  తమిళ్ హీరోలు చాలా మందికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. అలా ఎన్నో సంవత్సరాల నుండి తన సినిమాలని తెలుగులో డబ్ చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో రజనీకాంత్. రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా బాబా మన అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రజనీకాంత్ నటించిన ప్రయోగాత్మక సినిమాల్లో ఒక సినిమాగా బాబా నిలిచిపోతుంది.

 

famous young celebrity in rajinikanth baba movie poster

అయితే, ఈ సినిమా పోస్టర్‌లో ఇప్పుడు ఫేమస్ అయిన ఒక ప్రముఖ సెలబ్రిటీ కనిపిస్తారు. పైన కనిపిస్తున్న పోస్టర్ గమనించండి.  అందులో రజనీకాంత్ పక్కన నిల్చున్న పిల్లాడు మరెవరో కాదు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. అనిరుధ్ రజనీకాంత్ కి బంధువు అవుతారు. అలా అనిరుధ్ కూడా రజనీకాంత్ నటించిన బాబా సినిమా 6వ వీక్ స్పెషల్ పోస్టర్‌లో కనిపించారు. అజ్ఞాతవాసి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పని చేయడం మొదలు పెట్టారు అనిరుధ్. ఆ తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకి కూడా సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తమిళ సినిమాల సంగీత దర్శకత్వం పనిలో ఉన్నారు అనిరుధ్.


End of Article

You may also like