Ads
మెగాస్టార్ చిరంజీవికి ఈ స్టార్ డమ్ ఊరికే రాలేదు. ఆయన కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నిటిని దాటుకుని ఆయన ఈ స్థాయికి వచ్చారు.
Video Advertisement
ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటూ.. పగలు రాత్రి ఎడతెరపి లేకుండా కష్టపడ్డారు. అయితే.. ఆ సమయంలో ఆయనకు చాలా ప్రయత్నాలు బెడిసి కొట్టాయి కూడా. అలాంటి వాటిల్లోనే ఒకటి “బాషా” సినిమా రీమేక్.
అవును. నిజానికి బాషా తమిళ్ సినిమా. తమిళనాట సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ కు ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సినిమా. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకుల అభిమానాలను చూరగొన్న సినిమా. ఈ సినిమా తెలుగులో డబ్ చేయడానికి ముందే.. మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఒకవేళ మెగాస్టార్ అనుకున్నట్లు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి ఉంటె.. మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ చేరి ఉండేది. ఈ సినిమా తెలుగు రీమేక్ కి “బిగ్ బాస్” అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఇంతకీ ఈ సినిమాను మెగాస్టార్ ఎందుకు రీమేక్ చేయలేదో తెలుసుకుందాం.
మెగాస్టార్ తెలుగు సినిమా హక్కులను కొనుగోలు చేయాలనీ అల్లు అరవింద్ కు సూచించారట.ఈ సినిమాను రీమేక్ చేయడం కోసం ముందుగా తమిళ్ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ డీల్ కోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నం చేసారు. ఇందుకోసం అల్లు అరవింద్ గారు బేరసారాలు మొదలుపెట్టారు. బాషా తమిళ్ ప్రొడ్యూసర్ 40 లక్షలు డిమాండ్ చేయగా.. అల్లు అరవింద్ పాతిక లక్షలకు అడిగారట. అయితే.. బేరం కుదరకపోవడంతో ఈ డీల్ ఆగిపోయింది. 1998 లోనే తెలుగు లో విడుదల అయిన బాషా డబ్ సినిమా తెలుగునాట రజిని కి మంచి ఫాలోయింగ్ ని ఏర్పరిచింది.
End of Article