Ads
రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ వంశీ టేకింగ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఖడ్గం లాంటి దేశ భక్తి సినిమాలతో పాటు, ఇటు మురారి, నిన్నే పెళ్ళాడుతా, గోవిందుడు అందరివాడేలే, చందమామ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను, అంతే కాకుండా అంతపురం, డేంజర్, గులాబీ, సముద్రం లాంటి థ్రిల్లర్ సినిమాలను హ్యాండిల్ చేయడం లో కృష్ణ వంశి దిట్ట.
Video Advertisement
అయితే ఖడ్గం లాంటి దేశభక్తి సినిమాలో ప్రేక్షకులు షాక్ అయిన సీన్ ఒకటి ఉంది. అదే సంగీత సీన్. సంగీతకు రవితేజ అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఆమె తల్లి ఆమెను హీరోయిన్ చేయాలనీ కలలు కంటూ ఉంటుంది.
ఆ సమయంలో ఓ డైరెక్టర్ గదిలోకి పంపిస్తుంది. సంగీత ఆ డైరెక్టర్ ఒళ్ళో కూర్చుని మందు తాగిస్తూ ఉన్న సమయంలో రవితేజ వస్తాడు. అయితే.. కృష్ణ వంశి ఫ్యామిలీ రిలేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎక్కువగా చూపిస్తుంటారు. ఇలాంటి సన్నివేశాన్ని చూపించడంతో అందరు షాక్ అయ్యారు. దీనితో సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే ఇలాంటివి తప్పదేమో అన్న కామెంట్లు వినిపించాయి.
మరోవైపు, రమ్యకృష్ణ కు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యిందని.. అందుకే కృష్ణ వంశి ఆ డైరెక్టర్ ని టార్గెట్ చేసి ఈ సీన్ ను పెట్టారన్న టాక్ కూడా వినిపించింది. ఇదే సమయంలో ఇండస్ట్రీ లో ఓ నటి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే దర్శక, నిర్మాతలకు లొంగిపోవాల్సిందేనని, రమ్మంటే గదుల్లోకి వెళ్లాలని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయమై చర్చ జరిగింది.
End of Article