హఠాత్తుగా ఉద్యోగం మానేసింది.. కట్ చేస్తే రూ.137 కోట్ల వ్యాపారం..!!

హఠాత్తుగా ఉద్యోగం మానేసింది.. కట్ చేస్తే రూ.137 కోట్ల వ్యాపారం..!!

by Megha Varna

Ads

చాలా మంది ఈ రోజుల్లో ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఆసక్తి ఉందా లేదా..? అందులో రాణించగలనా లేదా అనే వాటిని పట్టించుకోవడం లేదు. ఉద్యోగం వచ్చింది కదా చాలులే అన్నట్లు బతికేస్తున్నారు. కానీ నిజానికి అలా ఉద్యోగం చేయడంలో ఆనందం ఉండదు. అయితే ఒక ఆమె కూడా తాను చేసే ఉద్యోగంలో ఆనందం లేదని హఠాత్తుగా మానేసింది.

Video Advertisement

చాలా మంది ఎందుకు మానేస్తున్నావు..? అని అడిగారు నిజానికి అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. చివరి సారి ఎప్పుడు ఆఫీస్ కి ఆనందంగా రావాలని నీకు అనిపించింది అని ఒక మెంటార్ అడిగితే ఎప్పుడూ లేదని ఆమె అంది.

ఈమె ఇండోర్ లో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి హైదరాబాద్ డెలాయిట్ లో ఉద్యోగం పొందింది. ఈ కంపెనీలో ఏడాదిన్నర పాటు పని చేసింది. అయితే ఈ ఉద్యోగం నచ్చలేదు కదా..? మరి ఏం చేస్తావు అని మెంటార్ అడిగితే అప్పటికి ఆమెకి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఒకరోజు ”మెరిల్ స్ట్రీప్స్” అనే ఒక సినిమా చూస్తే..

ఆమెకి పాత దుస్తులు పైన ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలిసినది. దీనితో ఆమె ఫ్యాషన్ కెరీర్ ని ఎంచుకుంది. ఈమె మొదట ఇటలీలో ఫ్యాషన్‌ బయింగ్‌ అండ్‌ మర్చండైజింగ్‌లో ఏడాది పాటు ఒక కోర్సు చేసింది. ఆ తరవాత అక్కడే కొంత కాలం ఒక బ్రాండ్ లో వర్క్ చేసింది. తరవాత ఇండియా వచ్చేసి.. ఇక్కడ మరో బ్రాండ్ లో పని చేసింది.

నెక్స్ట్ వివాహం, ఒక పాప కూడా. ఆమెకి వ్యాపారం చేయాలనేది కల. దానిని భర్తకి చెప్పింది. అతను కూడా సరే అన్నాడు. అంతర్జాతీయ బ్రాండ్‌ ‘జరా’ ఆమెని బాగా ఆకర్షించింది. 25 ఏళ్ల వయసులో 2014లో రూ.3.5 లక్షలతో అక్స్‌ ని గుడ్‌గావ్‌లో స్టార్ట్ చేసిందీమె.

ఫ్యాబ్రిక్ ని తీసుకుని కుట్టించి ఈకామర్స్‌ సైట్లలో అమ్మేది. అలానే వ్యాపారం కూడా బాగా రన్ అవుతుండడంతో నెమ్మదిగా వ్యాపారాన్ని మరెంత పెంచింది. 2018 నాటికే రూ.100 కోట్ల వ్యాపారం అయ్యింది. ఇప్పుడామె వ్యాపారం రూ.137 కోట్లకు పైనే. ఆమెతో 200 మంది పని చేస్తున్నారు. డిజైనింగ్‌, మార్కెటింగ్‌ ఆమె చూసుకుంటే..ఆర్థిక వ్యవహారాలను తన భర్త చూసుకుంటాడు. తన బ్రాండ్‌ స్టోర్లను దేశవ్యాప్తం చేయడమే ఆమె లక్ష్యం అని అంటోంది.


End of Article

You may also like