Valimai Review : తమిళ స్టార్ “అజిత్” నటించిన వలిమై.. హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Valimai Review : తమిళ స్టార్ “అజిత్” నటించిన వలిమై.. హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : వలిమై
  • నటీనటులు : అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మకొండ, హుమా ఖురేషి.
  • నిర్మాత : బోనీ కపూర్
  • దర్శకత్వం : హెచ్. వినోద్
  • సంగీతం : యువన్ శంకర్ రాజా
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2022

valimai movie review

Video Advertisement

స్టోరీ :

చెన్నైలో చైన్ స్నాచింగ్ ఎక్కువ అవుతుంది. కొంత మంది ముసుగు వేసుకుని బైక్ మీద వచ్చి ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇవి మరీ ఎక్కువ అయిపోవడంతో పోలీస్ చీఫ్ ఎవరైనా ఒక అనుభవం గల పోలీసు ఇలాంటి కేస్ హ్యాండిల్ చేస్తే చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. దాంతో ఏసీపీ అర్జున్ (అజిత్ కుమార్) రంగంలోకి దిగుతాడు. ఈ చైన్ స్నాచింగ్ వెనకాల ఉన్న కథ ఏంటి? అసలు ఈ క్రైమ్స్ ఎవరు చేయిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అర్జున్. చెన్నైలో ఇవన్నీ చేయిస్తున్న వోల్ఫ్ రంగా (కార్తికేయ) అర్జున్ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. చివరికి అర్జున్ ఈ కేస్ ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో అర్జున్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అర్జున్ తన కుటుంబాన్ని కాపాడగలిగాడా? చెన్నైలో జరిగే ఈ క్రైమ్స్ ఎలా ఆపారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

valimai movie review

రివ్యూ :

అజిత్ అంటే కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితులైన నటుడు. అజిత్ నటించిన తమిళ సినిమాలు అన్ని కూడా తెలుగులో విడుదల అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే విడుదల అయ్యింది. ఇది కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, హిందీలో కూడా విడుదల అయ్యింది. సినిమాలో అజిత్ పోషించిన అర్జున్ పాత్ర అజిత్ కి బాగా సూట్ అయ్యింది. అజిత్ స్వతహాగా ఒక బైక్ రేసర్. ఈ సినిమాలో రేసింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. అందులో అజిత్ డూప్ లేకుండా నటించారు. గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మళ్లీ కార్తికేయ నెగిటివ్ పాత్రలో నటించారు. కార్తికేయ గెటప్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ గా నటించిన హుమా ఖురేషి అజిత్ పక్కన పెయిర్ గా కాకుండా ముఖ్య పాత్రలో నటించారు. తన పాత్ర వరకు బాగా నటించారు.

valimai movie review

యువన్ శంకర్ రాజా అందించిన పాటలు సినిమా మధ్యలో బ్రేక్ లాగా అనిపిస్తాయి. మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమా మధ్యలో ఈ పాట ఏంటి అని అనిపిస్తుంది. కానీ పాటలు వినడానికి బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేశాయి. దర్శకుడు వినోద్ ఒక ఇంగ్లీష్ సినిమా స్టైల్ లో కథని రాసుకున్నారు. టేకింగ్ కూడా అలానే ఉంది. కానీ యాక్షన్ సినిమాలో సెంటిమెంట్ యాడ్ చేయడంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఏమో అనిపిస్తుంది. ఈ సినిమాని మొత్తం ఒక యాక్షన్ సినిమాగా తీసినా బాగుండేది. లేదా ఒక ఎమోషనల్ సినిమాగా తీసినా బాగుండేది. కానీ ఆ రెండు కలపడంలో ఎక్కడో ఏదో లోపం జరిగింది అనిపిస్తుంది. సినిమాకి మెయిన్ హైలెట్ మాత్రం యాక్షన్ సీన్స్. ముఖ్యంగా బైక్ రేసింగ్ సీన్స్ అయితే తెరపై చూడటానికి చాలా బాగా కనిపించాయి. కథ మనకి అంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించినా కూడా టేకింగ్ వల్ల సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • అజిత్
  • యాక్షన్ సీన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • రిచ్ గా అనిపించే మేకింగ్

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • అనవసరంగా వచ్చే సెంటిమెంట్ సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఈ సినిమాలో అజిత్ కాకుండా వేరే ఎవరైనా హీరో ఉంటే రిజల్ట్ ఇలా ఉండేది కాదేమో. సినిమా కొంచెం రొటీన్ గా ఉన్నా పర్వాలేదు, మంచి యాక్షన్ థ్రిల్లర్ చూద్దాం, అంతే కాకుండా అజిత్ సినిమా అని అని అనుకునే ప్రేక్షకులని వలిమై నిరాశ పరచదు.


End of Article

You may also like