“అప్పుడేమో పక్కకి తోసేశారు.. కానీ ఇప్పుడు పవన్ తోనే సినిమా తీశారు..” భీమ్లా నాయక్ డైరెక్టర్ కి జరిగిన ఈ ఘటన గురించి తెలుసా?

“అప్పుడేమో పక్కకి తోసేశారు.. కానీ ఇప్పుడు పవన్ తోనే సినిమా తీశారు..” భీమ్లా నాయక్ డైరెక్టర్ కి జరిగిన ఈ ఘటన గురించి తెలుసా?

by Megha Varna

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 25 న విడుదల కానుంది. అయితే సాగర్ కే చంద్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.

Video Advertisement

ఎక్కడో నల్గొండ లో ఉండే వాడినని అలాంటి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చానని చెప్పారు. పైగా ఒక సారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అనుకున్నాను అని..

పాస్ తీసుకుని పంజా సినిమా ఈవెంట్ కి వచ్చానని.. అప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారిని చూడటం అంత ఈజీ కాదని అని చెప్పారు. పైగా అలా వచ్చినప్పుడు మూడు సార్లు నన్ను తోసేశారని సాగర్ కే చంద్ర చెప్పారు. అలానే ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పారు.

ఎప్పుడు కూడా నా హృదయం లో ఆయనని గురువుగా చూస్తానని చెప్పారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు ఈ సినిమాకి వెన్నెముక అని చెప్పారు. ఈ సినిమా జర్నీని ఎప్పుడూ మర్చిపోలేనని.. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అని సాగర్ కే చంద్ర చెప్పారు.

అలానే ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఒక గజల్ రూపం లో ”గెలుపు అంటే మోజు లేదు…. ఓటమి అంటే భయం లేదు…. చావే అంతం కాదు అన్నప్పుడు…. చావుకు మాత్రం ఎందుకు భయ పడటం…. ఆకాశం లోకి వెళ్లి గర్జించు.. జై పీఎస్‌పీకే” అని చెప్పారు.


End of Article

You may also like