Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. దీనిలో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
Video Advertisement
అంతా బాగానే ఉంది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎందుకు ఆలస్యంగా వచ్చారు..?, ఎందుకు ఏమీ మాట్లాడలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బ్యాక్ బోన్ గా ఉన్నారు.
మరి ఆయన ఎందుకు ఆలస్యంగా వచ్చారు ఎందుకు మాట్లాడలేదు అని ఫ్యాన్స్ కూడా అప్సెట్ అయ్యారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈ వేడుక జరిగింది. కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఈవెంట్ కి వచ్చారు. అయితే దర్శకుడు సాగర్ కె చంద్ర మాట్లాడారు.
ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాట్లాడతారని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. పైగా ఆలస్యంగా కూడా వచ్చారు. అలానే కేటీఆర్ ను కలిసిన తర్వాత మళ్లీ త్రివిక్రమ్ కనిపించ లేదు నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతారని.. ఆయన స్పీచ్ కోసం చాలా మంది ఎదురు చూశారు.
బండ్ల గణేష్ కూడా రాక పోవడంతో అందర్నీ అప్సెట్ చేసింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది చూస్తే… దర్శకుడు త్రివిక్రమ్ ఏ సినిమా పని అంతా చేసారని.. నిజానికి మొత్తం త్రివిక్రమ్ ఏ అంతా చేసుకుంటే సాగర్ కె చంద్ర కేవలం పేరుకు మాత్రమే దర్శకత్వం వహించారని తెలుస్తోంది. అందుకే సాగర్ కె చంద్ర కి అవకాశం ఇవ్వాలని త్రివిక్రం మాట్లాడలేదు. అయితే కారణమేదైనా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.
End of Article