Ads
హీరోగా విజయ్ శంకర్, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పోకస్. ఈ సినిమాకు సూర్య తేజ దర్శకత్వం వహించారు ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరమీదకు రాబోతుంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో భానుచందర్, సీనియర్ నటి సుహాసిని మణిరత్నం నటిస్తున్నారు ఈ చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతుంది
Video Advertisement
అయితే ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య తేజ తన డెబ్యూ మూవీ గా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ ఫోకస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నందు భానుచందర్, షియాజీ షిండే, జీవ, సూర్య భగవాన్, వంటి ఆర్టిస్టులు కాకుండా ఇంకా చాలామంది ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు దర్శకుడు సూర్య తేజ.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో సీనియర్ నటి సుహాసిని మణిరత్నం గారు ముఖ్య పాత్రను పోషించారు. కాగా ఈ చిత్రం నుంచి సువాసిని మణిరత్నం గారి ఫస్ట్ లుక్ విడుదలయింది. దీనిని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించడం విశేషం. ఈ చిత్రాన్ని స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
నటీనటులు : విజయ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్, జీవ, సూర్య భగవాన్ వంటి తదితర నటిస్తున్నారు.
సాంకేతిక బృందం
డైరెక్టర్: జి సూర్య తేజ
నిర్మాణం : రిలాక్స్ మూవీ మేకర్స్
సమర్పణ : స్కైరా క్రియేషన్స్
ఎడిటర్ :సత్య జి
డిఓపి : జై ప్రభాకర్ రెడ్డి
సంగీతం: వినోద్ యాజమాన్యం
లిరిసిస్ట్ : కాసర్ల శ్యామ్
End of Article