నందమూరి బాలకృష్ణ పెళ్లి శుభలేఖ చూసారా? వైరల్ అవుతున్న ఫోటో..!

నందమూరి బాలకృష్ణ పెళ్లి శుభలేఖ చూసారా? వైరల్ అవుతున్న ఫోటో..!

by Anudeep

Ads

సినిమా వాళ్ళ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి చిన్న విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. వాళ్లతో మనకి పరిచయం లేకపోయినా మన వాళ్లే అంత చనువు వస్తుంది. ఇలా చిన్నచిన్న విషయాలకే జనాల్లో చర్చ జరిగితే. పెళ్లి లాంటి పెద్ద విషయాలు తెలిసినప్పుడు డిస్కషన్ మామూలుగా జరగదు.

Video Advertisement

ఇది మాత్రం సినిమా ప్రియులే కాకుండా మామూలు ప్రజలు కూడా చర్చించుకునే విషయం. ఇంతగా పాకుతుంది అని సెలబ్రెటీలు జాగ్రత్తపడి ఆడంబరంగా చేసుకోకపోయినా, మీడియా పుణ్యమా అని అక్కడ జరిగే ప్రతి ఒక్క విశేషం అందరికీ తెలుస్తూనే ఉంటుంది.

balayya 1

సోషల్ మీడియా కారణంగా సెలెబ్రిటీల పర్సనల్ జీవితాల్లోని విశేషాలు కూడా చాలా మందికి తెలుస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా లో ఒక పెళ్లి పత్రిక ఒకటి తెగ వైరల్ అవుతోంది. అది ఎవరిదో కాదు.. ఆరుపదుల వయసులోనూ సింహంలా దూసుకుపోతున్న నట సింహం బాలయ్య బాబుది. నందమూరి నట వారసుడు బాలకృష్ణ పెళ్లి నాటి శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

balayya 3

బాలయ్యకు వసుంధర గారితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 8, 1982లో వీరి వివాహం జరిగింది. ఇప్పటికే వీరి పెళ్లి అయ్యి నాలుగు దశాబ్దాలు కావొస్తున్నాయి. అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లో ఈ శుభలేఖ గురించి సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదు. తాజాగా.. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. దీనిని వసుంధర గారి కుటుంబం అచ్చు వేయించారు.

balayya 2

ఆమె తల్లి తండ్రులు దేవ‌ర‌ప‌ల్లి సూర్యారావు – దేవ‌ర‌ప‌ల్లి ప్ర‌మీలారాణి లు, ప‌ద్మ‌శ్రీ డాక్ట‌ర్ నంద‌మూరి తార‌క రామారావు గారి ఐదవ కుమారుడు నందమూరి బాలకృష్ణకు ఇచ్చి వివాహం చేయిస్తున్నట్లు ఈ లేఖలో రాయించారు. 8వ తేదీ ఉదయం 12.41 నిమిషాల‌కు ముహూర్తం నిర్ణయించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో క‌ర్నాట‌క‌ క‌ళ్యాణ మండ‌పంలో వీరి వివాహం జరిగింది. బాలకృష్ణకు పెళ్లి వయసు వచ్చేనాటికి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు. ఈ బాధ్యతని అప్పటి మాజీ సీఎం నాదెండ్ల భాస్క‌ర‌రావు తీసుకున్నారు. ఆయన ద్వారానే బాలయ్యబాబుకి ఈ సంబంధం కుదిరిందని చెబుతుంటారు.


End of Article

You may also like