ఆర్జీవీని అమ్మాయిల పిచ్చోడని అనుకుంటారు.. కానీ..9 ఏళ్ల వయసులో ఏమైందంటే? షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చిన ఆర్జీవీ సోదరి..!

ఆర్జీవీని అమ్మాయిల పిచ్చోడని అనుకుంటారు.. కానీ..9 ఏళ్ల వయసులో ఏమైందంటే? షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చిన ఆర్జీవీ సోదరి..!

by Anudeep

Ads

రామ్ గోపాల్ వర్మ గురించి పెద్ద గా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఆ సినిమా వస్తోందంటే.. సినిమా కి క్లాప్ కొట్టిన రోజునుంచి.. థియేటర్ లో రిలీజ్ అయ్యే దాకా ఎడతెగని ఉత్కంఠ ఉండేది. ఆర్జీవీ సినిమాలకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. ఈ మధ్య ఆర్జీవీ లో వచ్చిన మార్పుని నెటిజన్లు గమనిస్తూనే ఉన్నారు. ఆయన సినిమా అంటే అదో రకమైన ఫీలింగ్ కలుగుతోంది.చాలా మంది కామెంట్స్ లో ఈ పాయింట్ ను లేవనెత్తకుండా ఉండరు.

Video Advertisement

 

ఎలా ఉండే ఆర్జీవీ.. ఎలా అయిపోయారు..? అంటూ అనుకుంటుంటారు. ఇవేమి ఆయన పట్టించుకోరు. కానీ ఆయన అభిమానులకు మాత్రం కొంత బాధ కలిగిస్తూనే ఉంటాయి. దానికి తోడు ఆర్జీవీ రిలీజ్ చేసే పోస్టర్లు, ఇంటర్వ్యూలలో ఆయన చేసే కామెంట్స్, సోషల్ మీడియాలో ఆయన పంచుకునే పోస్ట్లు.. ఇలా ఇవన్నీ కలిపి ఆయనని ఓ అమ్మాయిల పిచ్చోడు అనుకునేలా చేసాయి. కానీ.. ఆయన గురించి ఆయన సోదరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు.

rgv 3

ఆయన చిన్నతనంలో ఆయన ఎలా ఉండేవారో ఆయన సోదరి చెప్పుకొచ్చారు. ఆర్జీవీ కి విజయ లక్ష్మి గారు స్వయానా చెల్లెలు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆర్జీవీ గురించి చాలా విషయాలే చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచే ఆర్జీవీ లాజికల్ గా ఆలోచించడం, ప్రశ్నించడం వంటివి చేసేవారట. ఆయనని అర్ధం చేసుకోవడం ఎవ్వరి తరం అయ్యేదికాదట. ఓ సారి, ఆర్జీవీ, సోదరి విజయలక్ష్మి వారి మామయ్యతో కలిసి సినిమాకి వెళ్లారట.

RGV new 1

అయితే.. సినిమా అయ్యి ఇంటికి వచ్చాక.. తన డౌట్ తీర్చాలని ఆర్జీవీ వాళ్ళ మామని అడిగాడట. ట్రైన్ పట్టాలపై బాంబు పెట్టి.. ఆ రైలు వచ్చే టైం కి బ్లాస్ట్ అయ్యేలా ఎలా సెట్ చేసారు..? ఎందుకంటే మన దేశంలో ట్రైన్స్ ఎప్పుడూ సరైన సమయానికి రావు. కానీ ఆ బాంబు మాత్రం సరిగ్గా ట్రైన్ వచ్చే టైం కి ఎలా పేలుతుంది? అని అడిగాడట. ఇది అడిగేసమయానికి ఆర్జీవీ వయసు కేవలం 9 సంవత్సరాలేనట. అప్పటినుంచే ఆయన లాజికల్ గా థింక్ చేయడం, ప్రశ్నించడం నేర్చుకున్నారట.

rgv 2

ఇక అమ్మాయిల పిచ్చి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకి కూడా విజయలక్ష్మి సమాధానం చెప్పారు. ఆర్జీవీకి అసలు అమ్మాయిల పిచ్చి ఏమి లేదని.. కేవలం అమ్మాయిలని సంతోష పెట్టె మాటలని మాత్రం చెప్తుంటారట. ఓసారి విజయలక్ష్మి గారి ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు.. ఆమెని చూసిన ఆర్జీవీ మీ కళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పారట. ఆ విషయాన్నీ ఆ ఫ్రెండ్ విజయలక్ష్మి తో చెప్తే.. ఆమె ఆర్జీవీని అడిగారట. ఆమెకి మెల్లకన్ను.. నీకు ఎలా నచ్చాయి అని అడిగేసరికి.. నేను అసలు ఆమెని చూడలేదు అని ఆర్జీవీ సమాధానం చెప్పారట. మరోసారి ఓ బ్యాంకు లో అమ్మాయితో కూడా మీ నవ్వు బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారట. ఇలా.. అమ్మాయిలను సంతోష పెట్టె మాటలే తప్ప ఎప్పుడూ అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేయలేదని ఆర్జీవీ సోదరి విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.

Watch Video:


End of Article

You may also like