Ads
- చిత్రం : సెబాస్టియన్ PC 524
- నటీనటులు : కిరణ్ అబ్బవరం, కోమలి ప్రసాద్.
- నిర్మాత : బి సిద్దా రెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రమోద్, రాజు
- దర్శకత్వం : బాలాజీ సయ్యపురెడ్డి
- సంగీతం : జిబ్రాన్
- విడుదల తేదీ : మార్చ్ 4, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా మొత్తం మదనపల్లిలో జరుగుతుంది. సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) ఒక కానిస్టేబుల్. సెబాస్టియన్ కి రేచీకటి ఉంటుంది. నీలిమ (కోమలి ప్రసాద్) హత్యకి గురవుతుంది. ఆ సమయంలో సెబాస్టియన్ స్టేషన్ లో డ్యూటీలో ఉంటాడు. నీలిమ హత్యకి కారణం ఏంటి? నీలిమని ఎవరు చంపారు? సెబాస్టియన్ ఈ కేస్ ఎలా పరిష్కరించాడు? ఆ సంఘటనకి కారణమైన దోషులని ఎలా పట్టుకున్నాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాలతో కిరణ్ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఇప్పుడు సెబాస్టియన్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చారు. సినిమా పాయింట్ బాగుంది. కానీ అది చిత్రీకరించడంలో ఎక్కడో పొరపాటు జరిగింది అనిపిస్తుంది. రేచీకటి అనే అంశాన్ని ఇంకా బాగా చూపించవచ్చు ఏమో అనిపిస్తుంది. జిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకా కొంచెం బాగుండి ఉంటే సినిమా తెరపై ఇంకా బాగా కనిపించేది.
నటీనటులందరూ కూడా బాగా నటించారు. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం అయితే రేచీకటి ఉన్న కానిస్టేబుల్ పాత్రలో బాగా నటించారు. అలాగే సెబాస్టియన్ తల్లిగా నటించిన సీనియర్ నటి రోహిణి కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా వారి పాత్రలకి న్యాయం చేశారు. కానీ సినిమాలో మాత్రం కథ కొత్తగా ఉన్నా టేకింగ్ లో ఎక్కడో పొరపాటు జరిగింది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ లైన్
- నటీనటులు
- పాటలు
మైనస్ పాయింట్స్:
- తెరకెక్కించిన విధానం
- ఎడిటింగ్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సెబాస్టియన్ ఒక సీరియస్ గా నడిచే క్రైమ్ డ్రామా అయినా కూడా ప్రెజెంట్ చేసే విధానంలో కొన్ని లోపాలు ఉండడంతో అంత కొత్తగా అనిపించదు. సినిమా ఒక సారి అయితే కచ్చితంగా చూడొచ్చు.
End of Article