Ads
సన్ ఫ్లవర్ ఆయిల్ భారతీయుల నిత్యావసర సరుకుల్లో భాగం. నూనె లేకుండా ఏ వంట చేసుకోలేము. అంతలా మన జీవితాల్లో భాగం అయిన నూనె ఖరీదు పెరుగుతూనే ఉంటోంది. తాజాగా.. మరో వార్త వచ్చింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర మరొకసారి పెరిగే అవకాశం ఉందని.. లీటర్ 180 రూపాయల వరకు ఉండొచ్చు అనేది ఈ వార్తల సారాంశం.
Video Advertisement
ఇప్పటి వరకు నూనె ఖరీదు అసలు ధరకి 10 నుంచి 20 రూపాయల చొప్పున పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఏకంగా లీటర్ 180 రూపాయలకు చేరిపోయింది.
ఉన్నట్లుండి ఇంతలా ధర పెరగబోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్ కు రావాల్సిన 3 లక్షల 80 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ షిప్ మెంట్ ఆగిపోయింది. నల్ల సముద్రం పరిధి వద్ద ఉన్న షిప్పుల్లో ఈ వంట నూనె నిలిచిపోయింది. ఈ నిలిచిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ధర 570 మిలియన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రవాణా నిలిచిపోవడం వలన ప్రజలు మార్చి, ఏప్రిల్ నెలల్లో అవసరాల కోసం పామాయిల్ లేదా సొయా ఆయిల్ ను వాడాల్సి వస్తుంది.
ప్రపంచం మొత్తంలోనే సన్ ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో నల్ల సముద్రం ప్రాంతం 60 శాతం వాటిని కలిగి ఉంది. అలాగే ఎగుమతుల్లో 76% వాటా కలిగి ఉంది. భారత్ ప్రపంచంలోనే ఎక్కువ సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఎగుమతి చేసుకుంటోంది. మరో వైపు నల్ల సముద్రం ప్రాంతం నుంచి భారత్ కు 5.10 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు వీటిల్లో 1.30 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ మాత్రమే రవాణా అయ్యింది.
భారత్ పామాయిల్ ను ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే సొయా ఆయిల్ ను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి చేసుకుంటుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ను మాత్రం ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పటివరకు ఆయిల్ ధర భారత్ లో ఎక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ధర తగ్గిందనుకునేలోపే.. యుద్ధం కారణంగా ఆయిల్ ధర మరింత భారం కాబోతోంది.
End of Article