Ads
ఎప్పుడూ ఎవరినీ మనం చులకనగా చూడకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. ఈ క్షణం ఇలానే ఉంటుందని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఒక్కొక్క సారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. నిజానికి జీవితంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి.
Video Advertisement
పైగా ఊహించలేని సందర్భాలు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మనం ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నామని చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి చులకనగా మాట్లాడకూడదు, చూడకూడదు.
అలానే వృత్తిని బట్టి అవమానించకూడదు. ఏమో ఈ రోజు ఏమీ లేని వాడు రేపు ధనవంతుడు అవ్వచ్చు. లేదంటే ఇవాళ కోట్లాది ఆస్తి ఉన్నవాడు రేపు కూలివాడిగా కూడా మారిపోవచ్చు. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. పైగా ఎంతో మంది జీవితంలో ఇలాంటి మార్పులు కూడా జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఈమె ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిపోయింది.
ఈ బెలూన్లను అమ్మే అమ్మాయి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. దానితో తల్లితో పాటు బుడగలు అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఈమె పేరు కుస్బూ. అయితే ఒక ఫోటో గ్రాఫర్ మాత్రం ఈమె కి ఫోటో తీసి వైరల్ గా మార్చేశాడు. ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమె లుక్ ని మార్చాలని ఒక బ్యూటీ పార్లర్ కి తీసికెళ్ళి మేక్ఓవర్ చేసి తన కి ఫోటో షూట్ కూడా చేశారు.
ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తన కూతుర్ని మంచి పొజిషన్లో చూడాలని తల్లి అనుకుంది. నిజానికి సోషల్ మీడియా చాలా మంది జీవితాలనే మార్చేసింది. ఈ అమ్మాయి జీవితాన్ని కూడా సోషల్ మీడియా ఇప్పుడు మార్చేసింది. బెలూన్స్ అమ్మే అమ్మాయి ఇప్పుడు చూడడానికి ఒక మోడల్ లాగ మారిపోయింది.
End of Article