Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఇటీవల ఈ సినిమా రెండవ ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.
దీంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. రాధే శ్యామ్ సినిమాలో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే అంతకుముందు విడుదల చేసిన రాధే శ్యామ్ ట్రైలర్, లేదా సినిమాకి సంబంధించిన వేరే వీడియోల్లో కనిపించని కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. ఈ సినిమాకి సెట్టింగ్స్ కూడా ప్రధాన హైలైట్ గా నిలిచాయి. 1970 సమయంలో రోమ్ ఉంటుందో అలా ఈ సినిమాలో చూపించారు. ముందు ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసినా కూడా, తర్వాత కరోనా కారణంగా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేశారు. ఈ విషయంపై ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఇటీవల మాట్లాడారు.
“సినిమా కోసం రైళ్లు, ఇల్లు ఇంకా చాలా సెట్టింగ్స్ వేశారు. హీరోయిన్ ఇల్లు సెట్ వేసిన తర్వాత అందరూ చూసి మెచ్చుకోవడంతో చాలా ధైర్యం వచ్చింది” అని అన్నారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే షిప్ సీన్ షూట్ చేయడానికి మాత్రం సెట్టింగ్ ఎలా వేయాలి అనే విషయం పై చాలా చర్చ జరిగిందట. రామోజీ ఫిలిం సిటీలో నాలుగు అంతస్తుల భవనంలో ఈ సెట్ వేశారట. సాధారణంగా ఈ సదుపాయం ఉండడం చాలా అరుదు అని కానీ రామోజీ ఫిలిం సిటీలోనే అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయి అని, అందుకే సెట్టింగ్ ఇక్కడే వేసి షూట్ చేశాము అని, అందులో ఏ ఒక్కటి కూడా సెట్టింగ్ లాగా అనిపించదు అని రవీందర్ చెప్పారు.
End of Article