Ads
ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా కలుగుతుందో ఎవ్వరం చెప్పలేం. ప్రేమ కలిగితే కుల, మత, ప్రాంత బేధాలు అనే వాటికి అస్సలు చోటు ఉండదు. ఇందుకు ఈ సంఘటనే ఉదాహరణ. రష్యాకు చెందిన ఓ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం సొంత కంట్రీని వదిలేసి భారత్ కు వచ్చేసింది.
Video Advertisement
తాను మనసిచ్చిన వ్యక్తిని పెళ్లాడింది. తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట తిరిగి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతకీ వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందో చూద్దాం.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రిషి వర్మ అనే వ్యక్తి షెఫ్ గా పని చేస్తున్నాడు. కొంత కాలం పాటు హైదరాబాద్ లో కూడా పని చేసాడు. ఓ సారి 2019 లో రష్యాను పర్యటించడానికి వెళ్ళాడు. సెయింట్ పీటర్స్‌బర్గ్ సిటీ లో పర్యటిస్తూ ఉండగా లీనా బార్కొస్లేవ్ అనే ఓ అమ్మాయిని తన ఫోటోను తీయాల్సిందిగా కోరాడు. ఆ అమ్మాయి ఫోటోలు తీసి ఇచ్చింది. అలా వారి పరిచయం మొదలైంది. ఇద్దరు మాట్లాడుకున్నారు.
వారి పరిచయం స్నేహంగా మారింది. ఇండియాకి వచ్చేసిన తరువాత కూడా రిషి లీనాతో టచ్ లోనే ఉండేవాడు. రోజూ మాట్లాడుకునేవారు. ఓ రోజు ధైర్యం చేసి రిషి తన మనసులో మాటని చెప్పేసాడు. తనని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పేసాడు. అప్పటికే లీనా రిషికి మనసిచ్చేసింది. దీనితో వెంటనే ఒప్పేసుకుంది. గతేడాది డిసెంబర్ లోనే రిషి కోసం లీనా ఇండియాకి వచ్చేసింది.
ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. అందుకోసం అనుమతులు కూడా వచ్చేయడంతో ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీనా రష్యన్ అమ్మాయి అయినా హిందూ సంప్రదాయాలను, భారతీయ వంటకాలను అమితంగా ఇష్టపడుతుంది. తన ప్రేయసి కోసం రిషి కూడా రకరకాల వంటలను చేసి పెట్టాడు కూడా. లీనా కూడా భారతీయ వంటకాలను వండడం నేర్చుకుంది.. అలాగే వీరిద్దరూ తరచుగా ఆలయాలకు కూడా వెళ్తుంటారట. ఇలాంటివి చూస్తే ప్రేమ చాలా గొప్పది అనిపిస్తూ ఉంటుంది కదూ..
End of Article