Ads
- చిత్రం : ఈటీ (ఎవరికీ తలవంచడు)
- నటీనటులు : సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, సత్య రాజ్.
- నిర్మాత : కళానిధి మారన్
- దర్శకత్వం : పాండిరాజ్
- సంగీతం : డి ఇమ్మాన్
- విడుదల తేదీ : మార్చ్ 10, 2021
Video Advertisement
స్టోరీ :
కన్నీబరన్ (సూర్య) సైంటిస్ట్ కావాలి, దేశానికి సేవ చేయాలి అనుకుంటాడు. కానీ అది కుదరదు. దాంతో అడ్వకేట్ అవుతాడు. కన్నీబరన్ ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఊరుకోడు. అలాంటిది ఒక అమ్మాయికి సమస్య వస్తే ఏం చేశాడు? అమ్మాయిలపై జరిగే అన్యాయాలను ఎలా ఆపాడు? అనే విషయం చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది.
రివ్యూ :
సూర్య అంతకుముందు నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు థియేటర్లలో విడుదల అవ్వలేదు. కానీ ఆ సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఒక రకంగా ఈ రెండు సినిమాలతో సూర్య కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా చాలా పేరు సంపాదించుకున్నారు. ఎంతో పెద్దపెద్ద సెలబ్రిటీలు సూర్యని పొగిడారు. అందుకే ఈ సినిమా కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళంలో కూడా విడుదల అవుతోంది. ప్రేక్షకులకి ఈ సినిమా మీద అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అంతే కాకుండా దాదాపు రెండు సంవత్సరాల తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న సూర్య సినిమా ఇదే.
ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే ఆడవాళ్లపై జరిగే కొన్ని విషయాలను కూడా ఈ సినిమాలో మాట్లాడారు. సాధారణంగా అలాంటి విషయాలని చర్చించుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ ఈ సినిమాలో అలాంటి వాటిని ధైర్యంగా చెప్పారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సూర్య బాగా నటించడం మాత్రమే కాకుండా తన పాత్రకి తెలుగులో కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కి కూడా మంచి పాత్ర లభించింది. అలాగే ముఖ్య పాత్రలో నటించిన సత్య రాజ్, వినయ్ రాయ్, శరణ్య, మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత సూర్య మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా చేశారు.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- సినిమాలో చూపించిన అంశం
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడా కొంచెం ఎక్కువైన సెంటిమెంట్
- స్లోగా నడిచే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
సూర్యని ఒక యాక్షన్ సినిమాలో చూడాలి అని అనుకున్న వారిని ఈ సినిమా నిరాశ పరచదు. మొత్తంగా అయితే ఈటీ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
End of Article