Ads
- చిత్రం : రాధే శ్యామ్
- నటీనటులు : ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్య రాజ్.
- నిర్మాత : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ
- దర్శకత్వం : రాధా కృష్ణ కుమార్
- సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
- విడుదల తేదీ : మార్చ్ 11, 2021
Video Advertisement
స్టోరీ :
సినిమా కథ 1976 లో మొదలవుతుంది. విక్రమాదిత్య (ప్రభాస్) ఒక పెద్ద పామిస్ట్. ఒక ట్రైన్ జర్నీలో విక్రమాదిత్య ప్రేరణ (పూజా హెగ్డే)ని చూస్తాడు. విక్రమాదిత్య ప్రేరణని చూసిన వెంటనే ప్రేమిస్తాడు. కానీ ప్రేరణ మాత్రం విక్రమాదిత్యని ప్రేమించడానికి టైం పడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఎలా కలిసారు? విధికి, వారిద్దరి ప్రేమకి మధ్య ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే?
రివ్యూ :
ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా ఈ ఆసక్తి పెరగడానికి ఇంకా కారణం అయ్యాయి. సినిమాలో సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అప్పటి సమయంలో ఇటలీ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ప్రభాస్, పూజా హెగ్డే వేర్వేరుగా చాలా బాగా నటించారు అనిపిస్తుంది. వాళ్ల కాస్ట్యూమ్స్, గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత వర్కవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. వారిద్దరినీ చూస్తున్నంత సేపు ఒక లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన అంత కెమిస్ట్రీ లేదేమో అనిపిస్తుంది.
భాగ్యశ్రీ కనిపించినంత సేపు బాగానే నటించారు. జగపతి బాబు పాత్ర నిడివి కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా చాలా మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో ఉన్నారు. కానీ ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు బాగున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక లవ్ స్టోరీకి తగ్గట్టుగా ఉంది. లవ్ స్టోరీ కావడంతో స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. హాస్పిటల్ లో ఒక సీన్ లో కామెడీ అంత పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
ప్లస్ పాయింట్స్ :
- సెట్టింగ్స్
- విజువల్స్
- పామిస్ట్రీ అనే ఒక ఐడియా
మైనస్ పాయింట్స్:
- స్లోగా నడిచే సీన్స్
- క్లైమాక్స్
- హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
సినిమా విజువల్ గా చాలా బాగుంది. స్లోగా ఉన్న సినిమా అయినా పర్వాలేదు, ప్రభాస్ కోసం చూద్దాం, అది కూడా ఒక లవ్ స్టోరీ చూసి చాలా రోజులు అయింది అని అనుకున్న వారు అయితే ఈ సినిమా ఒక సారి కచ్చితంగా చూడొచ్చు.
End of Article