Ads
సాధారణంగా చాలామందికి చిరాకు తెప్పించే విషయం వెయిట్ చేయడం. కొంచెం టైం వరకు అంటే వెయిట్ చేయగలుగుతాం.
Video Advertisement
కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత చిరాకు మొదలవుతుంది. కానీ ఒక మహిళ తనకు న్యాయం జరగడం కోసం 52 సంవత్సరాలు ఎదురు చూసింది. వివరాల్లోకి వెళితే.
1967 లో సంపత్ సిన్హ్ అనే వ్యక్తికి లీలాతో పెళ్లి జరిగింది. పెళ్లయిన ఏడాదికి సంపత్ మరణించారు. వాళ్ల ఆచారాలను కట్టుబాట్లని గౌరవించి లీలా తన పుట్టింటికి వెళ్లిపోయారు. తర్వాత లీలా కి ఒక విషయం తెలిసింది. అదేంటంటే. నదియాడ్ లో ఉన్న 43 బిగాళ్ళ భూమి తన భర్త పేరు మీద ఉందని, దాన్ని తన మరిది మహిపత్ సిన్హ్ వాడుకుంటున్నారు అని తెలిసింది.
లీలా వెళ్లి మహిపత్ ని అడగగా అలాంటిదేమీ లేదు అని చెప్పారు. కానీ ఊరులో వాళ్లని ఆరాతీస్తే తన భర్త పేరుపై భూమి ఉన్న మాట నిజమే అని తెలిసింది. దాంతో లీలా పోలీసులను ఆశ్రయిస్తే పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేకపోయారు. మహిపత్ అప్పటికే తనకి అనుకూలంగా అన్ని పత్రాలను సృష్టించుకున్నారు.
దాంతో లీలా ఈ భూమి విషయం పై న్యాయం కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని అడుగుతున్నారు. తర్వాత లీలా కి మమ్లట్ దార్ మున్సిపల్ ఆఫీసులో తన భర్త పేరుపై ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిసింది. అంతే కాకుండా ఆ భూమికి కేవలం ఆయన ఒక్కరే వారసులు అని కూడా ఉంది.
లీలా ఈ పత్రాలని కోర్టులో సబ్మిట్ చేశారు. డిసెంబర్ 18, 2020 లో ఈ పత్రాలని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. ఈ విషయంపై మహిపత్ ని పిలిచి అడగగా తాను పత్రాలను ఫోర్జరీ చేసిన మాట నిజమే అని ఒప్పుకొన్నారు. పోలీసులు ఈ భూమికి హక్కుదారులు లీలా అని తేల్చారు. దాంతో 52 సంవత్సరాల తర్వాత లీలా కి న్యాయం లభించింది.
NOTE: Images used in the article and the featured image are just for representative purpose. But not the actual characters.
End of Article