Ads
ఉదయం నిద్రలేవగానే ప్రతి ఇంట్లో ముందుగా అవసరం అయ్యేది పాల ప్యాకెట్. అయితే.. ఏ కంపెనీ పాల ప్యాకెట్ అయినా దానిపై కొన్ని వివరాలు కామన్ గా ఉంటాయి. అవేంటంటే.. ఒక పాల ప్యాకెట్ ని ఎప్పుడు తయారు చేసారు.. ఏ తారీకు లోపు అది ఎక్స్పైర్ అయిపోతుంది లాంటి వివరాలు ఉండడం మాములే.
Video Advertisement
అయితే.. ఓ పాల ప్యాకెట్ పై మాత్రం “IIM Alumni” ట్యాగ్ ముద్రించబడి ఉంది. దీనితో ఈ విషయం చర్చనీయాంశం అయింది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసాక.. ఏ చిన్న వింత చోటు చేసుకున్నా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది.
అయితే.. ఇప్పుడు ఓ పాల ప్యాకెట్ పై కళాశాల పేరు ముద్రించబడడం చర్చకు తావిస్తోంది. ఓ పాల ప్యాకెట్ పై “ఫౌండెడ్ బై IIM Alumni అని ముద్రించి ఉండడంతో షాక్ అవుతున్నారు. ఈ ఫోటో ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టి ప్రశ్నించడంతో అది వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ విషయమై ట్విట్టర్ లో చర్చ నడుస్తోంది.
సాధారణంగా కొన్ని స్టార్ట్ అప్ కంపెనీలు ప్రచారం చేసుకునేటప్పుడు తాము చదువుకున్న కాలేజీ నేమ్స్ ను చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా ఓ పాల ప్యాకెట్ పై వేయడం మాత్రం నెటిజన్స్ లో చర్చకి తెరలేపుతోంది. ఏ కంపెనీ అయినా నాణ్యత ద్వారా పేరు పొందాలి కానీ.. ఇలా కాలేజీ పేరు చెప్పుకుని కాదు అని కొందరు వాదిస్తున్నారు. మరికొందరేమో.. ఇలా కాలేజీ పేరు వేసుకోనివ్వడం అనేది కాలేజీ తప్పేనని వాదిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ నడుస్తోంది.
What's the point of writing your college name on a MILK PACKET!???! 🙃 pic.twitter.com/TgE2uicXQg
— Namanbir Singh (@realNamanbir) March 13, 2022
End of Article