Ads
పెళ్లి తర్వాత ఆలుమగలు ఆనందంగా ఉండడం చాలా ముఖ్యమైనది. చాలా మంది భార్యాభర్తలు తరచూ గొడవలు పడటం వంటివి చేస్తూ ఉంటారు. నిజానికి సంసారం బాగుండాలంటే భార్యాభర్తలు తప్పకుండా ఇది తెలుసుకోవాలి. అయితే మరి మీ సంసారం కూడా బాగుండాలంటే ఖచ్చితంగా దీన్ని మీరు తెలుసుకోండి.
Video Advertisement
పెళ్లి తర్వాత మగవాళ్ళకి ఒక ఆసరా దొరుకుతుంది. ఆడవాళ్ళకి అయితే రక్షణ, భద్రత లభిస్తుంది. ఇలా భార్య భర్త ఇద్దరూ కలిసి సంసారం రధాన్ని ముందుకు తీసుకు వెళుతుంటారు.
అయితే నిజానికి ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజం. ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎవరు వుండరు. ఒకవేళ కనుక భార్యాభర్తల మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నా.. లేదు అంటే తీరని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సరే సంసారం లో ఇబ్బందులు వస్తాయి.
భార్య కానీ భర్త కానీ చేయలేనిది కానీ లేదంటే స్తోమత మించినది.. జరగని వాటిని ఎక్స్పెక్టేషన్స్ కింద పెట్టుకుంటే సమస్యలు రావడం సహజం. అదే విధంగా ఒక పని కాకపోతే మరొక అయినా పూర్తి చేయాలి. భర్త కోసం భార్య భార్య కోసం భర్త ఇది కుదరకపోతే అది అని చేస్తూ ఉండాలి. లేదంటే వాళ్ళ బంధం బాగోదు.
భార్య ని బాగా చూసుకోలేని వాడు ఎందుకు పనికి రాని వాడు అని ఆచార్య చాణక్య చెప్పారు. నిజానికి భార్యను భర్త అర్ధం చేసుకుని తోడుగా ఉండాలి. ఇది ఇలా ఉంటే ప్రతి భార్య కూడా తన భర్త బాగోగులు అడగాలి ప్రేమగా చూసుకోవాలి. అలాగే ఒకవేళ కనుక భర్తతో కనుక భార్య ఇబ్బంది పడుతూ ఉంటే మధ్యలో నేను ఈ వ్యక్తితో ఉండలేను.. సంసార జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేను అని నిర్ణయం తీసుకోవటం సరికాదు.
అతనికి నచ్చినట్లు వీలైనంత వరకు అనుసరించడమే మంచిది. ఒకవేళ కనుక భార్య భర్తతో విడిపోయి.. ఆమె జీవితంలో మరొక వ్యక్తి వస్తే ఆ జీవితం బాగుంటుందని ఎవరు గ్యారెంటీగా చెప్పలేము. కనుక కొన్ని కొన్ని సార్లు సర్దుకుపోవడం కూడా మంచిదే. మగవాళ్ళు ఎడ్జస్ట్ అవ్వాలి. అలానే ఆడవాళ్ళు కూడా సర్దుకుంటూ వెళ్లిపోవాలి. ఇలా ఉంటేనే సంసార జీవితం బాగుంటుంది. కాబట్టి భార్యాభర్తలు తప్పకుండా ఈ విధంగా అనుసరిస్తే మంచిది. అప్పుడు సంసారం బాగుంటుంది.
ALSO READ : గద్దర్ రాసిన చివరి లేఖ..! అందులో ఏం ఉందంటే..?
End of Article