Ads
పాపులర్ యూట్యూబర్, నటి గాయత్రి మృతి చెందారు. నిన్న రాత్రి గచ్చిబౌలి వద్ద రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఆమె వస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హోలీ వేడుకలకు పాల్గొనడానికి వెళ్లిన గాయత్రి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
విప్రో జంక్షన్ నుంచి కార్ గచ్చిబౌలి వైపుకు వస్తుండగా.. కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పై బోల్తా పడింది. కార్ లో గాయత్రితో పాటు ప్రయాణిస్తున్న మరో స్నేహితుడు రోహిత్ తీవ్ర గాయాల పాలయ్యాడు.
అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా, పార్టీ చేసుకుందాం అనుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ గాయత్రిని ఆమె ఇంటి వద్ద పిక్ చేసుకున్నాడు. అక్కడి నుంచి వారు ప్రిసమ్ పబ్ కి వెళ్లారు.
అక్కడ పార్టీ అయిపోగానే.. తిరిగి ఇంటికి బయలుదేరి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో గాయత్రినే కార్ డ్రైవ్ చేస్తూ ఉంది. అయితే… అతివేగంతో ప్రయాణిస్తూ ఉండడమే ఈ దారుణానికి కారణం అయ్యింది. ఆమె మరణంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి సురేఖ వాణి కూడా గాయత్రి మృతి పై తన విషాదాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసారు. తనతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.. అస్సలు మాటలు రావడంలేదంటూ విచారాన్ని వ్యక్తం చేసారు. మరో యూట్యూబర్ షన్ను కూడా గాయత్రి మృతితో విచారం వ్యక్తం చేసాడు.
End of Article