పెద్దలని కాదని పెళ్లి.. 7 నెలల గర్భవతి.. సరదాగా భర్తతో షికారుకు వెళ్లి..? అసలేం జరిగిందంటే..?

పెద్దలని కాదని పెళ్లి.. 7 నెలల గర్భవతి.. సరదాగా భర్తతో షికారుకు వెళ్లి..? అసలేం జరిగిందంటే..?

by Anudeep

Ads

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి పెళ్ళికి పెద్దలు అడ్డు చెప్పారు. అయినా వారిని ఎదిరించి వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరి ప్రేమ గెలిచిందని మురిసిపోయారు. వీరి ప్రేమకి ప్రతీకగా ఆమె గర్భం దాల్చింది. తొందరలోనే ముగ్గురం కాబోతున్నామని మురిసిపోయారు.

Video Advertisement

కానీ, అంతలోనే దారుణం చోటు చేసుకుంది. ఆమె ప్రస్తుతం ఏడవ నెల గర్భంతో ఉంది. భర్తతో కలిసి బండిపై షికారుకు వెళ్లిన ఆమె అనూహ్య రీతిలో మృతి చెందింది. ఈ దారుణం కర్ణాటకలోని మైసూరు సిటీలో చోటు చేసుకుంది.

aswini 1

పూర్తి వివరాల్లోకి వెళితే, విజయనగర్‌కు చెందిన అశ్విని (23) మైదనహళ్లికి చెందిన ప్రమోద్‌ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తొలుత వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఇంట్లో ఒప్పుకోకపోయినా, వీరిద్దరూ జూన్ 13, 2021న స్థానిక గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరిద్దరూ సఖ్యం గానే ఉన్నా.. రాను రాను గొడవలు మొదలయ్యాయి.

aswini 2
ప్రస్తుతం అశ్విని గర్భిణీగా ఉంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీనితో అశ్విని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ప్రమోద్ అత్తింటికి వెళ్లి తన అత్తా మామలతో మాట్లాడాడు. ఆరోజు మధ్యాహ్నం అశ్విని భర్తతో కలిసి షికారుకని బయటకు వెళ్ళింది. పొద్దు పోయినా వాళ్లిద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. దీనితో తల్లి తండ్రులలో కంగారు మొదలైంది.

aswini 3

ఇంటికి రావాలంటూ పిల్లలకి ఫోన్ చేసారు. కానీ ఇద్దరు ఫోన్ లు ఎత్తకపోయేసరికి కంగారు ఎక్కువైంది. బంధువులంతా కలిసి వారిని వెతకడం కోసం ప్రయత్నించారు. రాత్రయినా వారిద్దరూ కనిపించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ జంటకు వెతుకుతుండగా మరుసటి రోజు ఉదయం బిళికెరె చెరువులో అశ్విని మృతదేహం లభ్యమైంది. ప్రమోద్ కనిపించకుండా పోయాడు. అశ్వినిని ప్రమోదే చంపి చెరువులో పడేసి ఉంటాడని అశ్విని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రమోద్ ను వెతికే పనిలో పడ్డారు.


End of Article

You may also like