Ads
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి నెలలు కావస్తున్నా కూడా ప్రజలకి ఇంకా జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పునీత్ రాజ్‌కుమార్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల ఎంతో మంది పెద్ద పెద్ద సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Video Advertisement
పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా అయిన జేమ్స్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది.
ఈ సినిమాతో పునీత్ రాజ్‌కుమార్ ని ప్రజలు మరొకసారి గుర్తు చేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ కి ఇష్టమైన సంఖ్య 17. దాంతో కర్ణాటకలో చాలా థియేటర్లలో 17 నంబర్ ఉన్న సీట్ ఖాళీగా పెట్టారట. అందుకు కారణం ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు ఆ సీట్ లో పునీత్ రాజ్‌కుమార్ కూర్చుంటారు అని అక్కడి ప్రజలు నమ్మారు. అందుకే ఆ సీట్ ఖాళీగా పెట్టారు.
జేమ్స్ సినిమా డబ్బింగ్ పూర్తి అవ్వకముందు పునీత్ రాజ్‌కుమార్ మరణించారు. అలాగే పవన్ కుమార్ తో మరొక సినిమా కూడా ప్రకటించారు. అంతే కాకుండా 25వ తేదీ వరకు పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన జేమ్స్ సినిమా తప్ప మరొక సినిమా కర్ణాటకలో విడుదల చేసే వీలు లేదు అని తీర్మానం చేశారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా బృందం పునీత్ రాజ్‌కుమార్‌ని గుర్తు చేసుకున్నారు.
End of Article