RRR కి ఇదే ప్లస్ పాయింట్ అయ్యిందా..? ఇలా చేయకపోయి ఉంటే..?

RRR కి ఇదే ప్లస్ పాయింట్ అయ్యిందా..? ఇలా చేయకపోయి ఉంటే..?

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని సినిమాలో చూపించబోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అలాగే ఒలీవియా మోరిస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా సరన్ ఇంకా చాలామంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

changed shot of ntr in rrr trailer

సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లో ఉంది. తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఢిల్లీలో సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ అతిథిగా వచ్చారు.

rrr trailer analysis and hidden details

అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడి ఇప్పుడు విడుదల అవుతోంది. ఇది ఒక రకంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే టికెట్ ధరలు ఇప్పుడు పెరిగాయి. కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు తగ్గాయి. దాంతో ప్రజలు సినిమా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో సినిమా రిజల్ట్ ఇప్పుడు అయితే కలెక్షన్ల పరంగా బాగుంటుంది అని అనుకుంటున్నారు. కొత్త రికార్డులు కూడా నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.


End of Article

You may also like