Ads
ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్ ఇటీవల విడుదల అయ్యింది. ఇప్పుడు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.
Video Advertisement
అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.
ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలయ్యింది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు ఇలాగే ఉండబోతున్నాయి, కథ ఇలాగే ఉంటుంది అంటూ ఒక వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన ఒక పెద్ద వ్యాపార వేత్తగా నటిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ కొడుకు పాత్రలో ప్రభాస్ నటిస్తారు. అమితాబ్ బచ్చన్ కి సహాయం చేసే పాత్రలో దీపికా పదుకొనే నటిస్తున్నారు. సినిమా అంతా టైం మిషన్ నేపథ్యంలో సాగుతుంది. కాలాన్ని ఆపడం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లడం, అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్లడం అనే అంశం చుట్టూ సినిమా జరుగుతుందట. పురాణాలకి సంబంధించి కొన్ని కథలు పాత్రలు కూడా సినిమాలో ఉండబోతున్నాయట. సినిమాలో హీరో పేరు కూడా కె తో స్టార్ట్ అవుతుందట. అందుకే సినిమాకి ముందు వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కె అని పెట్టారట.
End of Article