RRR లో ఇది గమనించారా..? ఇంత ముఖ్యమైనది ఎలా వదిలేసారు..?

RRR లో ఇది గమనించారా..? ఇంత ముఖ్యమైనది ఎలా వదిలేసారు..?

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.

rrr movie review

సినిమాని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రతి భాషా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు సినిమా చూసి చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా సినిమాలో చిన్న చిన్న విషయాలపై కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అయితే సినిమా స్వతంత్రం రాకముందు జరిగిన కథ. అందుకే సినిమాలో చాలామంది బ్రిటిష్ నటులు ఉంటారు. దాంతో వాళ్ళందరూ ఇంగ్లీష్ డైలాగ్స్ చెప్పారు. ముఖ్యమైన సీన్స్ లో కూడా ఇంగ్లీష్ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం ఇంగ్లీష్ డైలాగ్ వస్తూ ఉంటే పక్కనే తెలుగులో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. చాలా చోట్ల సబ్ టైటిల్స్ వస్తాయి.

logic missed in rrr movie

సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్స్ ఉంటాయి. వాటికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ పెడితే బాగుండేది అనే కామెంట్స్ వస్తున్నాయి. కొమరం భీమ్ ని కొట్టమని లేడీ స్కాట్ ఒక ముళ్ల కొరడా అల్లూరి సీతారామరాజుకి ఇచ్చి, దాన్ని ముందు పోల్ మీద కొట్టమని, అప్పుడే దాని దెబ్బ అందరికీ తెలుస్తుంది అని అంటుంది. అక్కడ సబ్ టైటిల్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కానీ రాలేదు. అంత ముఖ్యమైన డైలాగ్ ఉన్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా అని అంటున్నారు. అలాగే జెన్నీ పాత్ర పోషించిన ఒలీవియా మోరిస్ జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా చోట్ల బ్యాక్ గ్రౌండ్ వాయిస్ మిస్ అయ్యింది. కొన్ని చోట్ల మాత్రం వాయిస్ వినిపిస్తుంది. దాంతో చాలా డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాలేదు.


End of Article

You may also like