Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. కొంత మంది కథ ముందుకు వెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించారు. వారి వల్లే సినిమాలో చాలా ట్విస్ట్‌లు వచ్చాయి.
వారిలో మల్లి పాత్ర పోషించిన అమ్మాయి తల్లి ఒకరు. సినిమా మొదట్లో ఈమె కనిపిస్తారు. ఆమెపై దాడి చేయడంతోనే సినిమా మొదలవుతుంది. ఆ పాత్ర పోషించిన నటి పేరు అహ్మరీన్ అంజుమ్. అహ్మరీన్ అంజుమ్ యాక్ట్ విత్ కాన్ఫిడెన్స్ అనే ఒక ఆన్లైన్ యాక్టింగ్ వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తుంటారు. అహ్మరీన్ అంజుమ్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించారు. అలాగే కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా నటించారు.
అంతకుముందు క్లాస్ ఆఫ్ 83, సర్ అనే సినిమాల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ లో మల్లి అనే అమ్మాయికి తల్లిగా నటించారు. అహ్మరీన్ అంజుమ్ కి నటనలో దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇంక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన అన్నీ చోట్ల కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గత కొంత కాలం నుండి ఇలాంటి టాక్ ఏ సినిమాకి కూడా రాలేదు. దాంతో రాజమౌళి పాన్ ఇండియన్ డైరెక్టర్ అని మరొకసారి నిరూపించారు అని ప్రేక్షకులు అంటున్నారు.
End of Article