Ads
ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ రాబోతున్న 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్నులో కొత్త నిబంధనలు అమలు లోకి రాబోతున్నాయి.
Video Advertisement
ఈ ఏడాది ఫిబ్రవరి లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్నుపై అనేక మార్పులను సూచించింది. ఈ లెక్కన ఆదాయపు పన్ను నిబంధనలతో అనేక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం.
#1 క్రిప్టో పన్ను: ఈ ఆర్థిక సంవత్సరం నుంచి క్రిప్టో కరెన్సీ పై కూడా పన్ను అమలుకానుంది. క్రిప్టో ఆస్తులపై సుమారుగా ముప్పై శాతం పన్నుని వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఏడాది జులై నుంచి ఒక శాతం టీడీఎస్ ను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
#2 లాభ నష్టాలు: డిజిటల్ ఆస్తుల విషయంలో వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం క్రిప్టో హోల్డర్లకు మరో వెర్షన్ లో ఉండే నష్టాలను డిజిటల్ ఆస్తులలో అనుమతించకూడదని పేర్కొంది. ఉదాహరణకి ఒక వ్యక్తికీ బిట్ కాయిన్ పై రూ. 1000 లాభం, మరో క్రిప్టో కరెన్సీ లో రూ 700 నష్టం వస్తే.. అతనికి మొత్తం మీద 300 రూ. లాభం వచ్చినట్లు అర్ధం. కానీ కొత్త నిబంధనల ప్రకారం సదరు వ్యక్తి బిట్ కాయిన్ కరెన్సీ లో లాభం వచ్చిన రూ. 1000 రూపాయలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సూత్రం స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర ఆస్తుల విషయంలో కూడా లాభ నష్టాలకు తావు లేకుండా పన్ను కట్టాల్సి ఉంటుంది.
#3 ఐటి రిటర్న్స్: ఆదాయపు పన్ను రిటర్న్స్ లలో తప్పులను సరిదిద్దుకోవడం కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇప్పుడు వీటిని సరిదిద్దుకోవడానికి రెండేళ్ల కాల పరిమితిని ఇచ్చింది.
#4 ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ మినహాయింపు:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుంది. వీరు సెక్షన్ 80CCD(2) కింద వారి బేసిక్ జీతంతో పాటు, డియర్ నెస్ అలోవెన్సు లో 14 శాతం దాకా ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. గతం లో ఈ వెసులు బాటు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉండేది.
#5 పిఎఫ్ ఖాతాలకూ పన్ను:
ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కొత్త నిబంధనలను అమలు పరచనుంది. ఈ నిబంధనల ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ రూ. 2.5 లక్షల రూపాయలు దాటితే పన్ను కట్టాల్సి ఉంటుంది.
#6 కోవిడ్ చికిత్స ఖర్చులపై పన్ను మినహాయింపు:
కోవిడ్ వైద్య చికిత్సల కోసం అందిన డబ్బుపై పన్ను మినహాయింపు ఉంటుంది. కోవిడ్ కారణంగా కుటుంబంలోని ఒక వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి అందే పది లక్షల డబ్బుపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ డబ్బు సదరు వ్యక్తి మరణించిన 12 నెలల లోపు అందితే ఎటువంటి పన్ను ఉండదు.
#7 వికలాంగులకు మినహాయింపు:
అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు, సంరక్షకులు అంగవైకల్యం కలిగిన వారు అయినప్పుడు వారికి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. వీరు భీమా పధకాన్ని తీసుకోవచ్చు. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది.
End of Article