Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. కొంత మంది కథ ముందుకు వెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించారు. వారి వల్లే సినిమాలో చాలా ట్విస్ట్‌లు వచ్చాయి.
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కేథరీన్ బక్స్టన్ అలియాస్ లేడీ స్కాట్. మల్లి పాట నచ్చడంతో లేడీ స్కాట్ మల్లిని తనతో పాటు తీసుకెళ్తారు. అలా అక్కడ సినిమా కథ మొదలవుతుంది. సినిమా మొత్తం లేడీ స్కాట్ కనిపిస్తారు. ఈ పాత్రలో నటించిన నటి పెరు అలిసన్ డూడీ. అలిసన్ డూడీ ఒక మోడల్, అలాగే నటి. 1985 లో తన సినిమా కెరీర్ మొదలు పెట్టారు. ఎన్నో పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాల్లో అలిసన్ డూడీ నటించారు. అలాగే టెలివిజన్ సిరీస్ కూడా చేసారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాలో కూడా నటించారు.
జేమ్స్ బాండ్ సినిమాలో తన పాత్రకి చాలా పాపులర్ అయ్యారు అలిసన్ డూడీ. అలాగే థోర్ సినిమాలో కూడా నటించారు. అలిసన్ డూడీ 1994లో ఇండిపెండెంట్ న్యూస్ అండ్ మీడియా సీఈవో అయిన గావిన్ ఓ’రైల్లీని పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. 2011లో ఒక టెలివిజన్ సిరీస్ షూటింగ్ సమయంలో వ్యాపారవేత్త అయిన డగ్లస్ డి జాగర్‌ని కలిసారు. వారిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు 2012లో హార్ట్ ఎటాక్ తో ఆయన మరణించారు.
End of Article