Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల మోస్ట్ ఎలిజిలిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ కొట్టి, ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే, రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Video Advertisement
అలాగే మరి కొన్ని సినిమాలను కూడా పూజా హెగ్డే సైన్ చేసారు. అంతే కాకుండా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా నటించారు. పూజా హెగ్డే తెలుగులో మొదటిగా నటించిన సినిమా ఒక లైలా కోసం. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించారు. ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.
ఆ తరువాత ముకుంద సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస విజయాలతో బిజీ గా ఉన్న ఈ భామ డిమాండ్ కూడా ఎక్కువ గానే ఉంటోంది. తెలుగు సినిమా ఆమె సైన్ చేయడానికి గాను మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారట. ఇది ఇలా ఉంటె.. ఆమె టీం ను కూడా మైంటైన్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారట. పాపులారిటీ పెరగడంతో పాటు ఆమె డిమాండ్ కూడా పెరగడంతో దర్శక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారట.
ఇది ఇలా ఉంటె.. పూజా హెగ్డేకు తొలుత కలిసి వచ్చిన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడ ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడంతో పాటు.. తక్కువ కాలంలోనే ఆమెకు స్టార్ డమ్ లభించింది. అయితే.. ప్రస్తుతం ఆమె తమిళనాట కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు బీస్ట్ లో నటించే అవకాశం లభించింది. ఇటీవల, బీస్ట్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. కాగా.. ఈ ట్రైలర్ లో పూజా హెగ్డే ను కేవలం 2 సెకండ్ల పాటు మాత్రమే చూపించారు. అది కూడా కేవలం బొమ్మలా నుంచున్నట్లు చూపించారు. దీనితో సోషల్ మీడియాలో పూజా పాత్ర సినిమాలో ఉందా లేదా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అదే కాకుండా.. ఎన్నో మంచి అవకాశాలను ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ వేల్యూ ఇప్పుడు తెలిసి వస్తుంది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
Watch Video:
End of Article