Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. అయితే సినిమాకి సంబంధించి అంతకుముందు రిలీజ్ చేసిన వీడియోస్ లో కనిపించిన సీన్స్ సినిమాలో మిస్ అయ్యాయి. హీరోల ఇద్దరి ఇంట్రడక్షన్ వీడియోస్ లో రెండు సీన్స్ చూపిస్తారు. కొమరం భీమ్ ఇంట్రడక్షన్ వీడియోలో భీమ్ ఒక పెద్ద అల ముందు నుంచొని ఉన్నట్టు చూపిస్తారు.
అలాగే అల్లూరి సీతారామరాజు ఇంట్రడక్షన్ వీడియోలో సీతారామరాజు కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు చూపిస్తారు. ఈ రెండు షాట్స్ కూడా సినిమాలో లేవు. సినిమా సెన్సార్ కి వెళ్ళినప్పుడు కొన్ని సీన్స్ కట్ అయ్యాయి. వాటిలో ఇవి కూడా ఉండి ఉండొచ్చు. అలాగే సినిమాలో ఇంకొక ముఖ్యమైన సీన్ కూడా కట్ అయ్యిందట. అంతే కాకుండా సినిమా చివరిలో ఎండ్ క్రెడిట్స్ వచ్చే సమయంలో కూడా కొంత భాగం వరకు కట్ చేసినట్టు సమాచారం.
End of Article