Ads
ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన తర్వాతే సినిమాకి చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో చిన్న చిన్న సీన్స్ కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే ఆ సీన్స్ కూడా చాలా లోతుగా రాసుకున్నారు. అందుకు ఉదాహరణ పుష్ప రాజ్ మొదటిసారిగా మంగళం శ్రీనుని కలిసే సీన్.
ఈ సీన్ సరిగ్గా గమనిస్తే ఇందులో చాలా అర్థం ఉంది. అదేంటంటే పుష్ప రాజు రాజ్ ఎవరికీ తలవంచడానికి ఇష్టపడడు. మంగళం శ్రీను దగ్గరికి సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల తీసుకువచ్చినా కూడా అది చేతిలో అలాగే పట్టుకొని నిల్చుంటాడు. మంగళం శ్రీను కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి వంగి సిగరెట్ వెలిగించుకోవడానికి ఇష్టపడడు. అందుకే అగ్గిపుల్ల మంట తన సిగరెట్ కి తగిలేంతవరకు అలాగే ఉంటాడు. అగ్గిపుల్ల మంట తన సిగరెట్ కి తగిలినప్పుడు వెలిగించుకుంటాడు.
watch video :
End of Article