పెళ్లి కావడం లేదా…..పెళ్లి చూపుల్లో ఈ మూడు సూత్రాలు పాటించండి.. వెంటనే సెట్ అయిపోతుంది..!

పెళ్లి కావడం లేదా…..పెళ్లి చూపుల్లో ఈ మూడు సూత్రాలు పాటించండి.. వెంటనే సెట్ అయిపోతుంది..!

by Sunku Sravan

Ads

మానవ జీవితంలో పుట్టడం ఒక అదృష్టం. ఈ జీవన గమనంలో వివాహమనేది చాలా స్పెషల్ గా భావిస్తారు. కానీ కొంతమందికి వివాహం కావడంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటి వ్యక్తులు ఈ మూడు సూత్రాలు పాటిస్తే సంబంధం ఇట్టే కలిసిపోతుంది.. అవేంటో చూద్దాం..? కొంతమంది పెళ్లి విషయంలో శాస్త్రాలను గౌరవించరు. అందులో ముఖ్యంగా యువతకు శాస్త్రాల గురించి చెబితే ఒక చెవితో విని మరో చెవితో వదిలెయ్యడం మనం చూస్తూనే ఉంటాం.

Video Advertisement

కొంతమందేమో విని ఊరుకుంటారు. మరికొంతమంది దాన్ని నమ్మినట్టు నటిస్తారు. ప్రస్తుత కాలంలో పెళ్లిచూపులు అంటే ఒక ఆర్భాటంగా భావిస్తున్నారు. వివాహం అంటేనే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరికైనా ఒక్కటే.

కానీ ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు కూడా హెచ్చుతగ్గులు చూపించకుండా అది మగపిల్లవాడు అయినా, ఆడపిల్ల అయినా సరే బాగా చదివించి వారి భవిష్యత్తును ఆలోచించి వివాహాలు చేస్తున్నారు. మా అమ్మాయి అక్కడికి వెళితే పుట్టినిల్లును తలుచుకోకుండా వారు ప్రేమిస్తారా లేదా అనేది చూస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా మా కుటుంబంలో కూతురులా కలిసి పోతుందా, అబ్బాయిని ప్రేమగా చూసుకుంటుందా లేదా ఇలా ఎన్నో ఆలోచనలతో సంబంధాన్ని చూసుకుంటున్నారు.

పూర్వ కాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఏదైనా పెళ్లి విషయం వస్తే పెద్ద వాళ్ళని తీసుకుని వెళ్ళేవాళ్ళం. వారు అక్కడికి వెళ్లి వారి అనుభవంతో కుటుంబ నేపథ్యం ఎలా ఉందో తెలుసుకునేవారు. కాని ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేవు. అందరూ ఉద్యోగాల పేరుతో విడిపోయి ఎక్కడికక్కడ బతుకుతున్నారు. దీనివల్ల ఎన్నిసార్లు పెళ్లి చూపులకు వెళ్లిన సంబంధం అనేది కుదరదు. అలాంటప్పుడు ఈ మూడు సూత్రాలు పాటిస్తే సంబంధం తొందరగా కుదురుతుంది అవేంటంటే..!

1. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మనకు ముఖ్యమైనటువంటి బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకెళ్లడం..

2.అబ్బాయికి అమ్మాయికి నచ్చితే గనక సంబంధాన్ని వెంటనే ఖాయం చేసుకోవడం.

3.ఈ సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత నిశ్చితార్థానికి ముహూర్తానికి అంటే వివాహానికి మధ్య ఎక్కువగా సమయాన్ని లేకుండా వెంటనే వివాహం అయ్యేట్టు చూసుకోవడం. ఈ మూడు సూత్రాలు గనక మనం పాటించామంటే పిల్లలకి వివాహం ఇట్టే అయిపోతుంది.


End of Article

You may also like