రియల్ లైఫ్ భన్వర్ సింగ్ షెఖావత్ ను చూసారా..? ఇంతకీ ఇతను ఎవరో తెలుసా..?

రియల్ లైఫ్ భన్వర్ సింగ్ షెఖావత్ ను చూసారా..? ఇంతకీ ఇతను ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

పుష్ప మూవీ థియేటర్ లో విడుదల అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఓటిటిలో విడుదల అయ్యిన తరువాత కూడా పుష్ప హవా కొనసాగుతూనే ఉంది. ఇంకా.. పుష్ప గురించి సోషల్ మీడియాలో కధనాలు వస్తూనే ఉన్నాయి.

Video Advertisement

పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

bhanvar 2

ఈ సినిమాలో చివరగా పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెఖావత్ అనే పాత్ర పరిచయం అవుతుంది. ఈ పాత్రను నటుడు ఫహద్ ఫాసిల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకి చాలా ఫాలోయింగ్ ఉంది. అందుకు ఈ వ్యక్తే ఉదాహరణ. ఈ ఫొటోలో నటుడు ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెఖావత్ గెటప్ ను పోలి ఉన్న వ్యక్తి కరీం నగర్ లో ట్రాఫిక్ పోలీస్ గా పని చేస్తున్నాడు. ఈ ట్రాఫిక్ పోలీస్ పేరు శ్రీనివాస్. పుష్ప సినిమాను చూసిన శ్రీనివాస్ భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రకి ఫిదా అయిపోయాడు. సాధారణంగా ఎవరైనా సినిమా హీరోలను పోలిన గెటప్ లను వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు.

bhanvar

కానీ, శ్రీనివాస్ అందుకు భిన్నంగా భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రని ఇమిటేట్ చేసాడు. ఆ పాత్రలానే గుండు కొట్టించుకుని రెడీ అయ్యాడు. అలానే డ్యూటీ చేస్తున్నాడు. దానికి తోడు, హైట్, లుక్ కొంచం మ్యాచ్ కావడంతో దూరం నుంచి చూస్తే అచ్చం ఫాసిల్ లానే కనిపిస్తున్నాడు. దీనితో అక్కడ అందరు అతనితో సెల్ఫీలు తీసుకోవడంతో శ్రీనివాస్ ఓ మినీ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ విషయమై శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను సెలెబ్రిటీలను అనుకరించడానికి ఇష్టపడతానని, అయితే భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర నాకు బాగా నచ్చడంతోనే ఆ గెటప్ ని అనుకరించానని, అయితే.. ఈ గెటప్ కి ఇంత గుర్తింపు రావడం మాత్రం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.


End of Article

You may also like