Ads
స్పోర్ట్స్ కు సంబంధించి సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా ఆదరణ పొందు తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో భాగ్ మిల్కా భాగ్, ధోని వంటి స్పోర్ట్స్ బయోపిక్ సినిమాలు విజయవంతం అవడంతో చాలామంది డైరెక్టర్స్ స్పోర్ట్స్ నేపథ్య సినిమాలకే జై అంటున్నారు. ఇప్పుటీ వరకు తెలుగులో మజిలీ, జెర్సీ, డియర్ కామ్రేడ్, స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే వచ్చాయి. అయితే క్రికెట్ గురించే కాకుండా బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలకు కూడా చాలా ఆదరణ లభిస్తోంది. గతంలో వచ్చినటువంటి తమ్ముడు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలు చాలా హిట్ అయ్యాయి.
Video Advertisement
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ లో కూడా ఈ సినిమాలు విజయవంతం అవుతున్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే లీగర్, గని, ఈఎన్ఈ సుశాంత్ బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు చేస్తున్నారు. తమ్ముడు నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ లిస్టులో ఉన్న సౌత్ ఇండియన్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం..!
#1 తమ్ముడు:
1999 లో వచ్చినటువంటి తమ్ముడు సినిమా ఆ సమయంలో ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పొచ్చు. అప్పటివరకు తెలుగులో అలాంటి సినిమాలు రాలేదు. ఇందులో పవన్ కళ్యాణ్ బాక్సర్ గా ఫైట్స్, డ్యాన్స్ లతో పెద్ద హిట్ అయ్యింది.
#2 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి:
ఈ మూవీ పవన్ కళ్యాణ్ తో చేయించాలని పూరి జగన్నాథ్ అనుకున్నారని కానీ పవన్ తిరస్కరించడంతో ఇది మాస్ మహారాజకి వెళ్లిందని, అతడు ఈ సినిమాతో కిక్ బాక్సర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా అప్పుడు చాలా విజయవంతమైంది.
#3 జై :
తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా జై… ఇందులో మొత్తం బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కథలో మేజర్ గా ఉండేది మాత్రం ఇదే అని చెప్పవచ్చు. ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ కోసం సిద్ధమయ్యే హీరో చివరికి పాకిస్తాన్ బాక్సర్ ని హార్డల్స్ క్రాస్ చేసి ఓడిస్తాడు.
#4 మాన్ కరాటే :
ఈ సినిమాలో తన లవర్ గురించి బాక్సర్ ల యాక్టింగ్ చేస్తాడు. మాన్ కరాటే అనే ప్రత్యేకమైన టెక్నిక్ తో బాక్సింగ్ మ్యాచ్లను గెలిచిన తర్వాత బాక్సర్ రాకున్నా అతను బాక్సింగ్ క్రీడా ఆడాల్సి వస్తుంది. ఆయన ఫైనల్ గెలుస్తాడా, లవర్ తో కలుస్తాడా అనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.
#5 ఇరుది సుత్రు/గురు:
సుధా కొంగర డెబ్యూ మూవీ ఇరుది సుత్రు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ చాలా విజయవంతమైంది. దీన్ని తెలుగులో గురుగా రీమేక్ చేశారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటించారు.
#6 సర్పత్తా పరంబరై :
ఇది ఈ మధ్య కాలంలో ఆర్య హీరోగా ఓ టి టి లో రిలీజ్ అయి బంపర్ హిట్ అయింది. బాక్సింగ్ మూవీ లో ఉండే ఎమోషన్స్ మరియు డ్రామాని యాడ్ చేసి రంజిత్ దీన్ని తెరకెక్కించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమ స్పోర్ట్స్ డ్రామా.
#7 పైల్వాన్ :
ఈ సినిమాలో కిచ్చ సుదీప్ రెజ్లర్ గా నటించారు. ఒక విషయంలో ఆయన బాక్సింగ్ చేయాలి. చివరికి ఆ రెజ్లర్ ట్రోపీ గెలిచాడా లేదా అనేది ఈ పైల్వాన్ కథ.
#8 ఘని :
మెగా హీరో వరుణ్ తేజ్ మంచి కంటెంట్ కాన్సెప్టుతో బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగా గని సినిమాలో బాక్సర్ గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
#9 లైగర్ :
ఇప్పటికే మాస్ మహారాజా రవితేజతో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ ద్వారా బాక్సింగ్ హిట్ కొట్టిన పూరి మళ్లీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో మన ముందుకు తీసుకురాబోతున్నారు.
#10 ఈ నగరానికి ఏమైంది ఫేమ్ సుశాంత్ బాక్సర్ గా :
ఈ నగరానికి ఏమైంది సినిమా లో మంచి లీడ్ రోల్ చేసిన సుశాంత్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత బాక్సర్ గా భైరవ సినిమా లో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సంగ్రహ లోకనంలో విడుదలైంది. ఇంకా వివరాలు తెలియవు.
End of Article