Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.
Video Advertisement
అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. అసలు బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలకి ఈ విధంగా రెస్పాన్స్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 సాహో సినిమా కి సుజిత్ దర్శకత్వం వహించారు. రాధేశ్యామ్ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. వీరిద్దరికీ కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఆ రెండూ కేవలం తెలుగులో విడుదల అయిన సినిమాలు. అవి హిట్ అయ్యాయి. కానీ పాన్ ఇండియన్ సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మిగిలిన రాష్ట్రాల ప్రేక్షకులకి కూడా నచ్చాలి. అందుకే కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కొన్నిచోట్ల నెగిటివ్ టాక్ వచ్చింది.
#2 పాన్ ఇండియన్ సినిమాగా సాహూ, రాధే శ్యామ్ విడుదల అవ్వకుండా ఉంటే ఫలితం వేరేగా ఉండేదేమో. రెండు సినిమాల్లో స్టోరీ లైన్ బాగుంది. కానీ 2 సినిమాలు పాన్ ఇండియన్ రేంజ్ ఉన్న సినిమాలు కావు అనే టాక్ వచ్చింది.
#3 అలాగే ప్రభాస్ కూడా చూడడానికి చాలా మారిపోయారు. బాహుబలి సినిమా సమయానికి ప్రభాస్ చాలా బరువు పెరిగారు. ఆ ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. సాహో సినిమాలో కూడా కొన్ని చోట్ల ఎనర్జీ ఉన్న సీన్స్ లో కూడా ప్రభాస్ చాలా సాధారణంగా నటించారు. రాధే శ్యామ్ సినిమాలో కూడా ప్రభాస్ డైలాగ్ డెలివరీ పై చాలా కామెంట్స్ వచ్చాయి.
#4 ప్రభాస్ అనేటప్పటికి ప్రేక్షకులకి కూడా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. బాహుబలి తర్వాత వచ్చే ప్రభాస్ సినిమాలు కూడా ఆ రేంజ్ లో ఉండాలి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటంతో స్టోరీ బాగున్నా కూడా, ఇంకా బాగుండి ఉంటే అది ప్రభాస్ రేంజ్ సినిమా అయ్యేదేమో అని అంటున్నారు.
ఈ కారణాల వల్ల బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన రెండు సినిమాలు కూడా డీసెంట్ గా ఉన్నా కూడా చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
End of Article