రియల్ స్టోరీ: నష్టాల్లో ఉన్నదాన్ని కాంట్రాక్టుకి తీసుకొని ఇప్పుడు నెలకు 25 లక్షల ట్యాక్స్ కట్టే స్థాయికి తీసుకొచ్చిన చాయ్ వాలా.!

రియల్ స్టోరీ: నష్టాల్లో ఉన్నదాన్ని కాంట్రాక్టుకి తీసుకొని ఇప్పుడు నెలకు 25 లక్షల ట్యాక్స్ కట్టే స్థాయికి తీసుకొచ్చిన చాయ్ వాలా.!

by Sunku Sravan

Ads

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అనేది మనం కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. టీ అమ్మి దేశానికి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. అదే కోవలో ఈయన కూడా ఎంతో కష్టపడి టీ అమ్ముతూ ప్రభుత్వానికి ఎంత టాక్స్ కడుతున్నారో తెలిస్తే అందరు నోరెళ్లబెట్టాల్సిందే.. మరి ఆ టీ వాలా ఎవరు.. ఆయన సక్సెస్ కు కారణమేంటో తెలుసుకుందాం..!

Video Advertisement

చాయ్ చటుక్కునా తాగరా బాయ్.. చాయ్ చమక్కులే చూడరా బాయ్..చాయ్ ఖరీదులో చీఫ్ రా భాయ్..చాయ్ గరీబ్ కి విందు..అంటూ చిరంజీవి తన పర్ఫార్మెన్స్ తో చాయ్ విలువను జనానికి చాటిచెప్పారు. అసలు టీలో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అందుకే చాలామంది టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అత్యంత తక్కువ ఖర్చుతో మంచి అనుభూతిని ఇచ్చేది టీ మాత్రమే. అది గరీబోళ్ల కైనా, నవాబులకైనా ఒకే విధమైన ఆనందాన్నిస్తుంది.

అందుకే టీ తాగడానికి బయట చాలా ప్రత్యేకమైన చోట్లు వెలుస్తున్నాయి. అలాంటిదే నీలోఫర్ కేఫ్.. హైదరాబాద్ నగరంలో చాలా కాలం నుండి బాబురావు నీలోఫర్ కేఫ్ నడుపుతున్నారు. ఆ చాయ్ దుకాణంలో ఎప్పుడు జనాలు నిండుగానే ఉంటారు. అయితే బాబురావు నెలకు కట్టే జిఎస్టి 25 లక్షలు ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. పైగా ఆ చాయ్ దుకాణంలో 690 మంది వర్కర్లు పనిచేస్తారని, వారికి రోజు భోజనం ఖర్చు మూడు లక్షలు అవుతుందట.

మొదట బాబురావు చాయ్ దుకాణాన్ని మొదలు పెట్టినప్పుడు, అది ఏ విధంగా ఉంటే జనాలు అట్రాక్ట్ అవుతారో ఆలోచించి ఆ విధంగానే తయారు చేశారట. ఆయన జిఎస్టియే అంత కడితే ఇక లాభాలు ఏ విధంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. బాబురావు సంపాదించిన సొమ్ములో చాలా భాగం పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటారట. షాప్ లో మిగిలిన బిస్కెట్లు, బ్రెడ్ ముక్కలను పేదలకు పంచుతూ ఉంటారు.

అలాగే ఆయన రోజు 300 మందికి భోజనం, 500 మందికి టిఫిన్స్ అందిస్తున్నారు. పేదవాళ్లు ఏది అడిగినా కాదనకుండా సహాయం అందిస్తారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన కొత్తలో బాబురావు ఏం చేయాలనే ఆలోచనలో భాగంగా, నష్టాల్లో ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్ ని కాంట్రాక్టు తీసుకొని డెవలప్ చేసి లాభాల బాట పట్టించారు. ఆయన చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డారని, ఈ స్థాయికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు. ఏది ఏమైనా బాబురావు ప్రజలతో బళా అనిపించుకుంటున్నాడు.


End of Article

You may also like