KGF-2 ఫస్ట్ రివ్యూ..? సినిమాకి హైలైట్ ఇదేనా..?

KGF-2 ఫస్ట్ రివ్యూ..? సినిమాకి హైలైట్ ఇదేనా..?

by Mohana Priya

Ads

కేజీఎఫ్ కన్నడ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తారో కేజీఎఫ్ సినిమా కోసం కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కేజీఎఫ్ – 2 ట్రైలర్ విడుదల అయ్యింది.

Video Advertisement

సెకండ్ పార్ట్ లో రవీనా టాండన్, సంజయ్ దత్, ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ట్రైలర్ చూస్తే ప్రకాష్ రాజ్ మనకి కథ చెబుతున్నట్లు తెలిసిపోతోంది. అనంత్ నాగ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో అలాంటి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

kgf 2 review by umair saindhu

మొదటి భాగంలో పోలిస్తే ఈ సినిమాలో చాలా విషయాలు ఉండబోతున్నాయి. అలాగే యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ – 2 సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవ్వబోతోంది. సినిమా బృందం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఉమైర్ సంధు ఈ విధంగా రాసారు, “ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో చాలా హార్డ్ హిట్టింగ్ సినిమా ఇది. సినిమా గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. యష్ చాలా బాగా నటించారు. ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా” అని రాశారు.


End of Article

You may also like