“కేజీఎఫ్-2″లో మెయిన్ ట్విస్ట్ ఇదేనా..? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా..?

“కేజీఎఫ్-2″లో మెయిన్ ట్విస్ట్ ఇదేనా..? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా..?

by Mohana Priya

Ads

కేజీఎఫ్ కన్నడ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తారో కేజీఎఫ్ సినిమా కోసం కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కేజీఎఫ్ – 2 ట్రైలర్ విడుదల అయ్యింది.

Video Advertisement

సెకండ్ పార్ట్ లో రవీనా టాండన్, సంజయ్ దత్, ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ట్రైలర్ చూస్తే ప్రకాష్ రాజ్ మనకి కథ చెబుతున్నట్లు తెలిసిపోతోంది. అనంత్ నాగ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో అలాంటి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

reason behind the release of kgf 2 teaser in only one language

మొదటి భాగంలో పోలిస్తే ఈ సినిమాలో చాలా విషయాలు ఉండబోతున్నాయి. అలాగే యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ – 2 సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవ్వబోతోంది. సినిమా బృందం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. సినిమాలో కథా పరంగా కూడా చాలా ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. సినిమాకి సంబంధించి ఒక ట్విస్ట్ కూడా బయటికి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో హీరోయిన్ శ్రీ నిధి శెట్టి మాట్లాడారు. శ్రీ నిధి శెట్టి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.

major twist in kgf 2 leaked

ఇందులో తన పాత్రకి, అధీరా పాత్రకి, అలాగే రమికా సేన్ పాత్రకి సంబంధం ఉంటుంది అని, అది ఏమిటో తెలిసిన తర్వాత ప్రేక్షకులు షాక్ అవుతారు అని అన్నారు. అలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అని అన్నారు. అలాగే ఈశ్వరీ రావు పోషించిన పాత్ర కూడా సినిమాకి చాలా ముఖ్యమైన పాత్ర అని సమాచారం. అధీరా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. రమికా సేన్ ఒక రాజకీయ నాయకురాలు అని మనకి ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరి వారి ముగ్గురి మధ్య ఉండే సంబంధం ఏంటో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like