Ads
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన యాక్షన్ మూవీస్ కి ఒకప్పుడు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. అల్లూరి సీతారామరాజు గా ఆయన కనబరిచిన నటనను ఏ తెలుగు ప్రేక్షకుడు అంత తొందరగా మరిచిపోలేదు. ఆయన బాటలోనే తనయుడు మహేష్ బాబు కూడా అడుగులు వేశారు. సూపర్ స్టార్ గా మహేష్ బాబు కూడా అభిమానుల గుండెల్లో నిండిపోయారు.
Video Advertisement
తాజాగా.. సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల సోషల్ మీడియా లో కృష్ణ ఫోటో ఒకదానిని షేర్ చేసారు. అయితే ఈ ఫొటోలో కృష్ణ ఫోటో చాలా డిఫరెంట్ గా ఉంది. దీనితో ఆయన ఫాన్స్ ఈ ఫోటోని చూసి ఆందోళన చెందుతున్నారు.
వయసు రీత్యా కృష్ణ గారు ఈ మధ్య ఎక్కువగా బయటకు రావడం లేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫంక్షన్ కి వెళ్లారు. ఈ ఫంక్షన్ లో తీసిన ఫోటోను ఆయన కూతురు మంజుల నెట్టింట్లో పంచుకున్నారు. అయితే.. ఈ ఫొటోలో ఆయన ముఖం డిఫరెంట్ గా కనిపించడంతో పాటు.. ఏవో తెల్ల మచ్చల లాగ కనిపించడంతో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
దీనితో, స్పందించిన ఆయన కూతురు మంజుల స్పందించారు. కృష్ణ గారు ఇన్విజిబుల్ మాస్క్ ను ధరించారని.. అది ఫొటోలో చూడడానికి అలా కనిపిస్తోంది అని.. ఆయన పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనితో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
End of Article