Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
ఈ సినిమాలో నాటు నాటు పాట కూడా సూపర్‌హిట్ అయింది. ఈ పాటలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఇద్దరు హీరోలతో పోటీ పడతాడు. వారికి డాన్స్ తెలుసా అని అడుగుతాడు. తర్వాత హీరోలు ఇద్దరు డాన్స్ వేస్తూ ఉంటే వారితో పాటు కలిసి డాన్స్ వేస్తాడు. ఆ నటుడు ఆ పాటలో తప్ప ఆ సినిమాలో మరెక్కడా కనిపించడు. ఆ నటుడి పేరు ఎడ్వర్డ్ బుహాక్. ఎడ్వర్డ్ బుహక్ చాలా కాలం నుండి నటన రంగంలో ఉన్నారు.
image source : Instagram (eduardbuhac)
ఎడ్వర్డ్ 1995లో తన కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత ఒక టీవీ షో చేసారు. ఆ తర్వాత కొన్న టీవీ సిరీస్‌లో నటించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కూడా జాక్ పాత్రలో నటించారు. కనిపించేది కొంత సేపే అయినా కూడా పాపులర్ అయ్యారు. ఎడ్వర్డ్ యాక్టర్ మాత్రమే కాదు. ఒక రచయిత అలాగే ఒక నిర్మాత కూడా. ఎడ్వర్డ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన తర్వాత రాజమౌళికి థాంక్స్ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.
End of Article