Ads
కెజిఎఫ్ సినిమా తో కన్నడ హీరో యష్ కు ఎంత ఫాలోయింగ్ ఏర్పడిందో చూస్తూనే ఉన్నాం. కెజిఎఫ్ మొదటి చాప్టర్ ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదల అయ్యింది. అయితే.. ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యష్ కి భారత్ మొత్తంలో అభిమానులని సంపాదించి పెట్టింది.
Video Advertisement
తాజాగా… విడుదల అయిన రెండవ చాప్టర్ కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యష్ తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు.
తనది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు. తన తండ్రి బస్ డ్రైవర్ గా పని చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే తాను సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదన్నారు. సినిమాలు అందరికి అచ్చిరావని ఆయన భావించే వారన్నారు. అయితే.. నా ఇష్టాన్ని కాదనలేక నన్ను సినిమాల్లోకి వెళ్ళడానికి ఒప్పుకున్నారన్నారు. చేతిలో మూడొందల రూపాయలు పెట్టి సినిమాల్లోకి పంపించారు. ఒకవేళ అవకాశాలు రాకపోతే ఎదో ఒక పని చేసుకుందామన్నారు.
ఆ మూడొందల ఖర్చు అయిపోయేసరికి నాకు సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అలా సీరియల్స్ లో నటించడం ప్రారంభించాకే తనకి గుర్తింపు వచ్చి సిల్వర్ స్క్రీన్ పై కూడా అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదంతా అభిమానుల చలవే అనే.. అభిమానుల వల్లే తనకి ఈ గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.
End of Article