చంటి సినిమాలో మీనా పడుకున్న మంచం వాడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్..!!

చంటి సినిమాలో మీనా పడుకున్న మంచం వాడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్..!!

by Sunku Sravan

Ads

విక్టరీ వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తనదైన శైలిలో నటిస్తూ ఆల్ రౌండర్ నటుడిగా మంచి పేరు సంపాదించారు. ఆయన మొదటి సినిమా అయినా కలియుగ పాండవులు నుంచి కొన్ని నెలల కింద వచ్చిన ఎఫ్ 2 పాత్రలో నటించడం కాదు జీవించారు. వెంకటేష్ జీవితం లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు వేరు.

Video Advertisement

ఈ తరం హీరోల్లో ఎక్కువ సక్సెస్ లు ఉన్న హీరో వెంకటేష్. కానీ ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం చంటి. అప్పటివరకు ఆవేశపూరిత పాత్రలు చేసిన వెంకటేష్ చంటి సినిమా తర్వాత కుటుంబ తరహా పాత్రలు కూడా అవలీలగా చేయగలరనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసింది.

వెంకటేష్ నటించిన ప్రతి సినిమా మ్యూజికల్ గా మాత్రం చాలా హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జంటగా మీనా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టారా అనే విధంగా కనిపించారు చంటి సినిమాలో.. అమాయకుడు పాత్రలో చంటి చేసిన యాక్టింగ్ ను ఇప్పుడు చూసిన కానీ విజిల్ వేస్తారు. మరి ఆ సినిమా వెనుక చాలా చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ప్రభూ కుష్బూ నటించిన చిన్న తంబి ప్రివ్యూ కావాలని మూవీ మొఘల్ రామానాయుడుకు ఆహ్వానం వచ్చింది. వెంటనే రామానాయుడు బొబ్బిలిరాజా నిర్మాత అయిన వెంకట్రామిరెడ్డి నీ తీసుకొని ప్రివ్యూ

 

చూడడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టువంటి కె.ఎస్.రామారావు వీరితో కలిసి వెళ్లారు. ఇంటర్వెల్లో ఈ సినిమా వెంకటేష్ కి పనికి వస్తుందేమో అనుకున్న కానీ చాలా కష్టం అనిపించింది అని రామానాయుడు కేఎస్ రామారావు గారితో చెప్పారట. దానికి కారణం అప్పటి వరకు వెంకటేష్ పూర్తి యాక్షన్ సినిమాలు చేశారు. వెంటనే ఈ సినిమా కోసం కె.ఎస్.రామారావు రవిరాజా పినిశెట్టి కి ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఎందుకంటే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ఒక సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇదే చిన్న మార్పులు చేస్తే చాలా

బాగుంటుంది అని చెప్పారు ఆయన. చిన్న తంబీ డైరెక్టర్ ను కలిసి రీమేక్ హక్కులను తీసుకున్నారు. అందరూ ఈ సినిమా రాజేంద్రప్రసాద్ చేస్తారని అనుకున్నారు. కానీ వెంకటేష్ ఇది నేను చేస్తాను అని కేఎస్ రామారావు గారిని పిలిపించాడంట. హీరోయిన్ గా చాలా మంది కొత్త అమ్మాయిలు అనుకొని చివరికి మీనాని సెలెక్ట్ చేశారు. ఈ సమయంలో సినిమా ప్రారంభించడానికి మొదటి క్లాప్ చిరంజీవి కొట్టారట. ఈ సినిమాలో మీనా బెడ్ రూమ్ లో ఒక మంచం కనిపిస్తుంది. దాని వెనుక ఒక పెద్ద కథ

ఉంది. శ్యామ్ చిత్రం కోసం ఒరిజినల్ టేక్ కలపతో ఆ మంచాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో ఆ మంచాన్ని ఉపయోగించారు. ఆ మంచం ఏ సినిమాలో వాడితే ఆ సినిమా హిట్ అయింది. దీంతో ఆ మంచం వాడిన సినిమాలన్నీ హిట్ అవుతాయని సెంటిమెంట్ కూడా నడిచింది. 66 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోటి రూపాయలు ఖర్చు అయింది. 1992 జనవరి 10వ తేదీన ఈ మూవీ విడుదలయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది


End of Article

You may also like