RRR సినిమాలోని “దోస్తీ” పాటలో… ఇది గమనించారా..?

RRR సినిమాలోని “దోస్తీ” పాటలో… ఇది గమనించారా..?

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

did you observed this in rrr dosti song

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. తర్వాత సినిమా మార్చ్ లో విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే పాటలు విడుదల చేశారు. ఈ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమాలోని దోస్తీ వీడియో సాంగ్ ఇటీవల విడుదల అయ్యింది.

did you observed this in rrr dosti song

అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. అందులో కొమరం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మాంసం తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే నుంచున్న రామరాజు, అలాగే రామరాజు బాబాయ్ భీమ్ ని చూస్తారు. భీమ్ ఆ మాంసం తీసుకెళ్లి లోపల ఉన్న రాహుల్ రామకృష్ణకి ఇస్తాడు. అప్పుడు రాహుల్ రామకృష్ణ మాంసం ఒక రంధ్రంలో నుంచి లోపలికి వేస్తారు. అప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అది మనం సినిమా చూస్తున్నప్పుడు మొదటిసారి గమనించం. కానీ అప్పుడే పులి సౌండ్ వస్తుంది. అంటే భీమ్ అప్పటినుండే ఆ జంతువులు అన్నిటికీ ఆహారం పెట్టి వాటిని దాడి కోసం తయారు చేస్తున్నాడు.

watch video :

 


End of Article

You may also like