Ads
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.
Video Advertisement
బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే తమ కంటెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ చేయాలి అనుకునే ఫిలిం మేకర్స్ కి బాహుబలి ఒక ధైర్యం ఇచ్చింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఎన్నో రికార్డులు నెలకొల్పాయి. రాజమౌళి సినిమాలు అన్ని హిట్ అవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 మంచి టీం
ఏదైనా ఒక సినిమా కానీ, ఏదైనా ఒక విషయం కానీ సక్సెస్ అవ్వాలి అంటే మంచి టీమ్ ఉండడం చాలా ముఖ్యమైనది. రాజమౌళి కూడా తన టీం సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. వీరిలో చాలా మంది రాజమౌళి కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి రాజమౌళితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. చాలా మంది టెక్నీషియన్లని రాజమౌళి ఇప్పటి వరకు కూడా మార్చలేదు. దాంతో వారందరికీ మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆలోచనలు కూడా కలవడంతో ఔట్ పుట్ అనేది సరిగ్గా వస్తుంది.
#2 కథ
రాజమౌళి సినిమాల్లో హీరో, హీరోయిన్ కాదు కథ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కూడా అందులో ఉన్న హీరో హీరోయిన్లు కాకుండా ఆ కథలోని పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.అసలు ఆ పాత్ర పోషించే వాళ్లు ఒక స్టార్ అనే ఒక విషయం మనం మర్చిపోతాం. కథ వల్లనే సినిమాలో ఉన్న పాత్రలు ఇంకా హైలైట్ అవుతాయి. రాజమౌళి తన సినిమా కథ కి అంత ప్రాముఖ్యత ఇస్తారు.
#3 మార్కెట్ కోసం సినిమా తీయకపోవడం
రాజమౌళి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని, లేదా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయరు. తన సినిమాలే ఒక ట్రెండ్ సెట్టర్ అవుతాయి. ఒక పాయింట్ అనుకొని ఆ పాయింట్ ని కథలాగ డెవలప్ చేసి రాజమౌళి సినిమా చేస్తారు. అందుకు ఉదాహరణలు ఈగ, మర్యాద రామన్న. కథలు చాలా సింపుల్ గా ఉన్నా కూడా మేకింగ్ రాజమౌళి స్టైల్ లో ఉంటుంది. మామూలుగా కథ విన్నప్పుడు, “అసలు ఇలాంటి సినిమా ఆడుతుందా?” అని అనుకుంటారు. కానీ రాజమౌళి ఈ సినిమాలు తీసిన తర్వాత అవి ఎలాంటి రికార్డ్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
#4 పురాణాల రిఫరెన్స్
దాదాపు ప్రతి రాజమౌళి సినిమాల్లో కూడా పురాణాలకు సంబంధించిన ఏదో ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం పురాణాలని ఇప్పటి ప్రజల మైండ్ సెట్ కి తగ్గట్టుగా చెప్పడం రాజమౌళికి మాత్రమే సాధ్యమేమో. వీటి ద్వారా పురాణాలకి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటి తరానికి కూడా తెలుస్తున్నాయి. అలా రాజమౌళి ఇతిహాసాలను కూడా మళ్లీ వెలుగులోకి తీసుకువస్తున్నారు.
ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులని కవర్ చేసి రాజమౌళి సినిమాలు చేస్తారు కాబట్టి రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. ఆ ప్రేక్షకులు ఎలాంటి వయసు వారైనా సరే. అందుకే చిన్న నుండి పెద్దల వరకూ అందరూ రాజమౌళి సినిమాలంటే ఇష్టపడతారు. ఎంతోమంది దర్శకులు కూడా రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
End of Article