KGF సినిమాలో అంధుడిగా నటించిన ఈ తాత ఎవరో తెలుసా..? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

KGF సినిమాలో అంధుడిగా నటించిన ఈ తాత ఎవరో తెలుసా..? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

by Anudeep

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.

krishnaji 1

కెజిఎఫ్ సినిమాతో చాల మంది నటీ నటులకు ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చేసింది. అలాగే… ఈ సినిమాలో అంధుడిగా నటించిన ఈ తాత గుర్తున్నాడా..? ఈ సినిమాతో ఈ పాత్ర పోషించిన నటుడికి మంచి గుర్తింపు రావడంతో.. ఆయన ఎవరో తెలుసుకోవాలని కెజిఎఫ్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. కెజిఎఫ్ సినిమాలో అంధుడిగా నటించిన ఈ తాత పేరు కృష్ణాజీ. ఆయన ఆంధ్ర ప్రదేశ్- కర్ణాటక బోర్డర్ కు చెందిన వ్యక్తి.

krishnaji 2

సినిమాలపై అమితమైన ఆసక్తి కలిగిన కృష్ణాజి చిన్నతనం నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు తెగ చూసేవారు. తానూ కూడా సినిమాల్లోకి వచ్చి నటించాలని ఆయన కలలు గన్నారు. ఈ క్రమంలోనే ఈ తాత ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటనకు శిక్షణ తీసుకున్నారు. అవకాశాలు దొరికే వరకూ కొంతకాలం పాటు సినిమా వారికి దుస్తులు కుట్టే పనిని కూడా చేసారు. ఈ క్రమంలో ఆయనకు భీమ్ వెంకటేష్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది.

krishnaji 3

ఆయనతో కొంతకాలం పని చేసారు. ఆ తరువాత కమల్ హాసన్ మేక్ అప్ బాయ్ తో పరిచయం ఏర్పడగా.. ఆయన వద్దే టచప్ బాయ్ గా చేరాడు. ఆ తరువాత శంకర్ నాగ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం లభించింది. ఈ అవకాశమే ఆయనకి కెజిఎఫ్ లో నటించే ఛాన్స్ తెచ్చిపెట్టింది. అలా కెజిఎఫ్ లో వచ్చిన అవకాశాన్ని కృష్ణాజీ సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


End of Article

You may also like