మంచం రెడీగా వుంది వెళ్లి పడుక్కో అంటూ కోపం చూపించిన సావిత్రి..!

మంచం రెడీగా వుంది వెళ్లి పడుక్కో అంటూ కోపం చూపించిన సావిత్రి..!

by Megha Varna

Ads

సీనియర్ నటుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో సావిత్రి కూడా ఒకరు. ఈమె న‌ట‌న‌తో మ‌హాన‌టిగా మారారు. నాటకాల నుండి సావిత్రి స్టార్ హీరోయిన్ గా మారారు సావిత్రి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో నటించి ఈమె మంచి పేరుని పొందారు. అలానే సావిత్రి త‌న టాలెంట్ తో ఎన్నో అవార్డుల‌ను కూడా పొందారు.

Video Advertisement

ఇక ఇది ఇలా ఉంటే రామవిజేతా వారి చిత్ర షూటింగ్ సమయం లో సావిత్రి, దీప మధ్య సంభాషణ జరిగింది. ఈ చిత్రానికి బాబూరావు దర్శకత్వం వహించారు. బాబూరావు దీపను సావిత్రికి పరిచయం చేసారు.

ఆ తరవాత మంచి పాత్రలను చేస్తున్నావా అని సావిత్రి అడిగారు. దానికి దీప తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలు చేస్తున్నాను. అలానే హిందీ సినిమాల్లోనూ బుక్ అయ్యానని దీప చెప్పారు. దానికి సావిత్రి ఒక నటికి భాష కాదు ఎలాంటి పాత్రలు వస్తున్నాయో కూడా ముఖ్యమన్నారు. భాష, కాస్ట్యూమ్స్ కాదు ముఖ్యం అని సావిత్రి చెప్పారు.

అలానే నెక్స్ట్ డే కూడా వీళ్లిద్దరు కలిసి సీన్ చెయ్యాలి. కానీ దీప ఇంకా రాలేదు. దీనితో సావిత్రి వెళ్లి ఫ్లోర్ బయట కూర్చున్నారు. కాసేపు తరవాత దీప కారు దిగింది. అయితే ఆలస్యంగా రావడంతో సావిత్రికి కోపం వచ్చింది. సావిత్రి దీపతో ఏంటమ్మా ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించావు అని అడిగారు. అలానే ఆలస్యంగా వస్తే ఎలా..? నేనూ ఒకప్పుడు నీలానే బిజీ హీరోయిన్ ని అని అడిగారు. నా కోసం సెట్లో ఎవరూ ఎదురు చూడకుండా ఎంతో జాగ్రత్త పడేదాన్ని అని చెప్పారు.

అందరినీ ఇబ్బంది పెట్టడం బాగుందా అని సావిత్రి దీపని అడిగారు. దీనితో దీప మీరు ఇంకా పాత కాలం లోనే వున్నారు. ఆ రోజుల్లో నెలకు ఓ చిత్రం ఉండేది. ఇప్పుడు వారానికే ఎన్నో చిత్రాలు స్టార్ట్ అవుతున్నాయి. మీరు సీనియర్ కనుక సంజాయిషీ ఇస్తున్నాను అని అన్నారు దీప. పైగా తలనొప్పి ఎక్కువ వుంది అని చెప్పారు. దీనితో సావిత్రి ఇంట్లో రెస్టు తీసుకోవాలకున్న నువ్వు ఇక్కడే రెస్టు తీసుకో.. ఎలానో జబ్బున పడి మంచమెక్కే సీన్ ఏ కదా.. సెట్లో మంచం రెడీగా ఉంది. నీరసంగా పడుకో. నేచురల్ గా ఉంటుంది అని చెప్పారు సావిత్రి.

 


End of Article

You may also like