ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న 7 మంది టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న 7 మంది టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

by Anudeep

Ads

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారి లైఫ్ లో ఏమి జరిగినా అందరి అటెన్షన్ వారిపైనే ఉంటుంది. అయితే చాల మంది సెలెబ్రిటీలు తమ పర్సనల్ లవ్ లైఫ్ గురించి అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే.. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలెబ్రిటీలు ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారు. వారిలో కొందరు హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ పై ఓ లుక్ వేయండి.

Video Advertisement

#1. సావిత్రి:


మహానటి సావిత్రి ఆరోజుల్లోనే స్టార్ హీరోల కంటే ఎక్కువ గానే గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆమె జెమినీ గణేశన్ ను ప్రేమించారు. అప్పటికే పెళ్ళయ్యి, పిల్లలు ఉన్న జెమినీ గణేశన్ ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

#2. సీత:

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వారిలో సీత కూడా ఒకరు. ముద్దుల మావయ్య సినిమాలో సీత బాలకృష్ణకి చెల్లెలిగా నటించారు. కోలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సీత ఓ నటుడిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2010 లో సీరియల్ నటుడు సతీష్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

#3. సాత్నా టైటస్:


ఈమె పేరు తెలుగు వారికి సుపరిచితమే. బిచ్చగాడు సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా బయ్యర్ కార్తీక్ ను ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారు.

#4  శ్రియ శరన్:


అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ కూడా రష్యా కు చెందిన ఆండ్రి కోషివ్ ను ప్రేమించి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

#5. రమ్యకృష్ణ:

ఒకప్పటి హీరోయిన్, నేటి స్టార్ నటి రమ్యకృష్ణ కూడా డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు.

#6. దేవయాని:

పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవయాని దర్శకుడు రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.s

#7. శ్రీదేవి:

జగదేక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి కూడా మొదట్లో హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి అయిన మూడేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె బోనీ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


End of Article

You may also like